Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి

Geetha Singh Son Death: ప్రముఖ హాస్యనటి గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నటి కరాటే కళ్యాణి ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ శాంతి అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2023, 10:07 PM IST
Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి

Geetha Singh Son Death: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ హాస్యనటి, కితకితలు సినిమా హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నటి కరాటే కళ్యాణి ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 'దయచేసి కార్ లో అయినా.. బైక్ లో అయినా జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు.. కమెడియన్ గీతాసింగ్ అబ్బాయి యాక్సిడెంట్ వల్ల మృతి చెందారు ఓం శాంతి' అంటూ పోస్ట్ పెట్టారు. కర్ణాటకలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా.. వీరిలో గీతాసింగ్ పెద్ద కుమారుడు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

అయితే గీతా సింగ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తన అన్నయ్య కుమారులను ఆమె దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అన్నయ్య అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన ఇద్దరు పిల్లలకు అన్ని తానై దగ్గర ఉండి చూసుకుంటోంది. మరణించిన గీతా సింగ్ కుమారుడి పేరు, రోడ్డు ప్రమాద వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.  

గీతాసింగ్ నార్త్ ఇండియా నుంచి వచ్చి కుటుంబంతో కలిసి తెలంగాణలో సెటిల్ అయ్యారు. ఇక్కడే తెలుగు నేర్చుకుని.. ఆ తరువాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈవీవీ సత్యనారాయణ ఆమెకు అవకాశాలు ఇచ్చి బాగా ప్రోత్సహించారు. ఎవడిగోల వాడిది సినిమాతో మంచి పేరు రాగా.. ఆ తరువాత అల్లరి నరేష్ సరసన కితకితలు మూవీలో హీరోయిన్‌గా నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఆమె ఇబ్బంది పడుతున్నారు.

Also Read:  Pawan Kalyan: చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్‌ సపోర్ట్.. వైసీపీ పాలనలోనే ఇలా చూస్తున్నాం..

Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News