Prison Gang Clash: జైలులో మారణకాండ.. 24 మంది ఖైదీలు మృతి, 48 మందికి గాయాలు

Prison Gang Clash: ఈక్వెడార్​లోని  తీరప్రాంత నగరమైన గ్వయాక్విల్‌లోని జైలులో జరిగిన అల్లర్లలో 24 మంది ఖైదీలు మరణించగా, మరో 48 మంది గాయపడ్డారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 10:18 AM IST
  • ఈక్వెడార్ లో దారుణం
  • జైలులో గ్యాంగ్ వార్
  • 24 మంది మృతి, 48 మందికి గాయాలు
Prison Gang Clash: జైలులో మారణకాండ.. 24 మంది ఖైదీలు మృతి, 48 మందికి గాయాలు

Prison Gang Clash:  జైలులో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 మంది ఖైదీలు మరణించారు. దీంతోపాటు 48 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన ఈక్వెడార్​లోని గ్వయాక్విల్‌​ ప్రాంతీయ జైలులో(Guayaquil Regional prison) జరిగింది.

సోమవారం రెండు గ్యాంగుల మధ్య చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారినట్లు ఈక్వెడార్‌ అధికారులు (Ecuador officials) మంగళవారం తెలిపారు. అనంతరం రెండు వర్గాల ఖైదీలు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో 24 మంది ఖైదీలు మృతిచెందారు. మరో 48 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.. "లాస్ లోబోస్" మరియు "లాస్ చోనోరోస్" జైలు ముఠాల మధ్య వివాదం కారణంగా ఇది జరిగిందని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. 

Also Read: Cannibal Couple: 30మందిని పైగా చంపి తిన్న నరమాంస దంపతులు... ఎక్కడంటే..??

ఈ ఘర్షణలో ఓవైపు.. భారీ పేలుళ్లు, దట్టమైన పొగ వస్తున్న క్రమంలో రెండు గ్యాంగులు జైలు గదుల కిటికీల్లోంచి తుపాకులతో కాల్పులు జరిపినట్లు పలు మీడియా సంస్థలు ఫొటోలు ప్రచురించాయి. జైలులో ఘర్షణ తలెత్తిన క్రమంలో ఆరుగురు వంటవారిని జైలు నుంచి కాపాడినట్లు గ్వయాక్విల్​ రాష్ట్రప్రభుత్వం పలు ఫొటోలు ట్విట్టర్(Twitter)​లో పోస్ట్​ చేసింది.

ఈ అల్లర్లను అదుపుచేసేందుకు పోలీసులు, సైనికులు రంగంలోకి దిగారు. సుమారు 5 గంటలపాటు శ్రమించి భద్రతా సిబ్బంది అల్లర్లను అదుపు చేసినట్లు ఈక్వెడార్(Ecuador) అధికారులు తెలిపారు. ఈక్వెడార్‌లోని మూడు జైళ్లలో 39వేల మంది ఖైదీలు ఉన్నారు. తరచూ ఈ జైళ్లల్లో ఘర్షణలు జరుతాయి. గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణల్లో 79 మంది మరణించారు. జూలైలో జరిగిన మరో ఘటనలో 22 మంది ఖైదీలు మృతిచెందారు. 

ఈ హింసాత్మక ఘటనపై ఇంటర్-అమెరికన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ (IACHR) ఆందోళన వ్యక్తంచేసింది. జైలు హింసపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఈక్వెడార్ ప్రభుత్వాన్ని కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News