అలస్కాలో సునామి హెచ్చరికలు జారీ

అలస్కాలో భూకంపం సంభవించింది. చినిక్ కు ఆగ్నేయంగా 256 కిలోమీటర్ల దూరంలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Last Updated : Jan 23, 2018, 04:55 PM IST
అలస్కాలో సునామి హెచ్చరికలు జారీ

అలస్కాలో భూకంపం సంభవించింది. చినిక్ కు ఆగ్నేయంగా 256 కిలోమీటర్ల దూరంలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలిపారు.

ఈ భూకంపం సునామిగా మారే ప్రమాదం ఉండటంతో.. అలస్కా, కెనడా ప్రాంతాల్లో సునామి హెచ్చరికలు జారీచేశారు. యుఎస్ పశ్చిమతీరంలో కూడా సునామి విరుచుకుపడే అవకాశం ఉందని యుఎస్ సునామి హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.

Trending News