Thumbs Up Emoji Fine: థంబ్స్ అప్ ఎమోజీ పంపినందుకు రూ.50 లక్షలు జరిమానా.. మీరు కూడా ఇలా సెండ్ చేస్తున్నారా..?

Farmer Fined for Sending Thumbs Up Emoji in Canada: థంబ్స్‌ అప్ ఎమోజీతో ఓ రైతు రూ.50 లక్షల జరిమానాకు గురయ్యాడు. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన కెనడాలో జరిగింది. ధాన్యం అమ్ముతానని మాట ఇస్తూ.. థంబ్స్ అప్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ధాన్యం అమ్మలేకపోవడంతో వ్యాపారి కోర్టుకు ఎక్కాడు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 10, 2023, 09:28 AM IST
Thumbs Up Emoji Fine: థంబ్స్ అప్ ఎమోజీ పంపినందుకు రూ.50 లక్షలు జరిమానా.. మీరు కూడా ఇలా సెండ్ చేస్తున్నారా..?

Farmer Fined for Sending Thumbs Up Emoji in Canada: చాలా మంది చాటింగ్ చేసే సమయంలో ఎక్కువగా ఎమోజీలను ఉపయోగిస్తుంటారు. ఒక్కో ఎమోజీకి ఒక అర్థం ఉండడంతో అవతలి వ్యక్తి అర్థమయ్యే రీతిలో ఎమోజీతో సమాధానం ఇస్తుంటారు. ముఖ్యంగా లవర్స్‌ అయితే ఎమోజీలతోనే చాటింగ్‌లో కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు.. ప్రేమను వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రకరకాల ఎమోజీలు అందుబాటులో ఉండడంతో మెసెజ్ టైప్ చేసే బదులుగా సింపుల్‌గా ఎమోజీతో రిప్లై ఇస్తున్నారు. మీరు కూడా ఇలా ఎమోజీతో రిప్లై ఇస్తుంటే కాస్త వెనుకా ముందు ఆలోచించండి. ఓ ఎమోజీతో రిప్లై ఇచ్చి ఓ వ్యక్తి రూ.50 లక్షల జరిమానాకు గురయ్యాడు. ఇంతకు ఏమైంది..? ఏంటి ఆ ఎమోజీ కథ..?

కెనడాలోని సస్కట్చేవాన్‌లో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా ధాన్యం వ్యాపారం నిర్వహించే వ్యక్తి.. క్రిస్ యాక్టర్‌ అనే రైతు వద్ద పంటలను కొంటానని చెప్పాడు. నవంబర్‌లో పంటలు తనకు అమ్మాలని.. మార్చి 2021లో ఆన్‌లైన్ మెసెజ్ పంపించాడు. ఇందుకు క్రిస్ యాక్టర్ రిప్లై ఇస్తూ.. థంబ్స్ అప్ ఎమోజీని పంపించాడు. దీంతో తనకే పంటలు అమ్ముతాడని ఆ వ్యాపారి భావించాడు. అయితే నవంబర్‌ క్రిస్ యాక్టర్ పంటలను అందించలేకపోయాడు. అప్పటికి పంటల ధర కూడా పెరిగింది. 

కాంట్రాక్ట్‌కు అంగీకారం తెలిపేందుకు థంబ్స్ అప్ ఎమోజీని ఉపయోగించినా.. ఒప్పందాన్ని ధృవీకరించలేదు. అయితే తనకు ధాన్యం విక్రయించనుందుకు వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. థంబ్స్ అప్ ఎమోజీతో ధృవీకరించాలని కోరాడు. విచారణ చేపట్టిన కెనడాలోని కోర్టు.. థంబ్స్-అప్ ఎమోజీని అధికారిక సంతకంగా గుర్తించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రైతుకు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఏదో చూద్దాంలే అనే ఉద్దేశంతో థమ్స్ అప్ ఎమోజీని పంపించిన రైతు.. చివరికి రూ.50 లక్షల జరిమానాకు గురయ్యాడు.

థంబ్స్-అప్ ఎమోజీని సాధారణంగా ఆమోదాన్ని తెలపడానికి లేదా "సరే" అని సూచించడానికి ఉపయోగిస్తారు. అవతలి వ్యక్తి మెసెజ్‌ను బట్టి ఒకే అనుకుంటే థంబ్స్-అప్ ఎమోజీ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా వేర్వేరు హ్యాండ్ ఎమోజీలకు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. ఎమోజీలను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఉద్దేశించిన అర్థం స్పష్టంగా అర్థమయ్యేలా చూసుకోవాలని ఈ సంఘటనను బట్టి తెలుస్తోంది.

Also Read: IND Vs WI 1st Test Match: రోహిత్‌శర్మకు జోడిగా యంగ్ ప్లేయర్.. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్.. టీమిండియా తుది జట్టు ఇలా..! 

Also Read: Tomato Offers: రూ.20కే కిలో టమాటా.. క్షణాల్లో ఖాళీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News