Israel-Hamas War: గాజాలో ఘోరం... ఆహారం కోసం చూస్తున్న వారిపై కాల్పులు.. 20 మందికి పైగా మృతి..

Israel Attacks: ఇజ్రాయెల్, హమాస్ ల మధ్యజరుగుతున్న యుద్ధంలో అమాయకులు బలౌతున్నారు. అక్కడ కనీసం తిండిలేక, పొట్ట చేతపట్టుకుని అమాయకులు ఆకలితో అలమటిస్తున్నారు. ఎవరు వచ్చి తమకు బుక్కెడు అన్నం పెడతారో అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 15, 2024, 06:47 PM IST
  • గాజాలో అమాయకులపై కాల్పులు..
  • శవాల దిబ్బలుగా మారిన పలు నగరాలు..
Israel-Hamas War: గాజాలో ఘోరం... ఆహారం కోసం చూస్తున్న వారిపై కాల్పులు.. 20 మందికి పైగా మృతి..

Israels Clarity On Gaza Crowd Gunfiring: కొన్నినెలలుగా ఇజ్రాయెల్ హమాస్ పై విరుచుకుపడుతుంది. బాంబులు, క్షిపణి,మిసైల్ దాడులతో హమాస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గాజా పట్టణం అంతా  ధ్వంసమైంది. ఇక మరోవైపు వందల మంది నిరాశ్రయులయ్యారు. కనీసం తాగడానికి నీళ్లు లేక, ఆహారం కోసం అమాయకులు అలమటిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇజ్రాయెల్ , హామాస్ లకు సూచిస్తున్నాయి. ఇక గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారికోసం.. కొన్నిదేశాలు తమ వంతుగా ఆహారంను భారీ లారీలు, పారాచూట్ లతో అందిస్తున్నాయి.

Read More: Viral News: పెళ్లిలో వరుడికి షాక్.. అందరి ముందు అలా చేశాడని నవవధువు ఏంచేసిందో తెలుసా..?

ఈ క్రమంలో.. ఇటీవల.. ఆహారం కోసం వేచి చూస్తున్న అమాయకులపై, కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 20 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.

Read More: Election Commission 2024: రేపే ఎన్నికల నగారా.. ఏపీ సహా 4 రాష్టాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన..

వీరిని గాజాలో అల్ షిఫా ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ సైన్యం ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. సాయం కోసం చూస్తున్న వారిపై కాల్పులు జరగ్గా..  దాదాపు 104 మంది మరణించారు. మరో 750 కిపైగా అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ట్రక్కులు, పారాచూట్ లతో కొన్ని దేశాలు ఆహారంను, మందులను సరఫరా చేస్తున్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News