Nobel Prize For Economics 2022: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకు ఆర్థిక నోబెల్.. ముగ్గురిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..

Nobel Prize For Economics 2022: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకుగానూ ఈ ఏడాది ఆర్థిక నోబెల్ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న ముగ్గురు అమెరికాకు చెందిన వారే కావడం విశేషం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 06:16 AM IST
Nobel Prize For Economics 2022: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకు ఆర్థిక నోబెల్.. ముగ్గురిని వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..

Nobel Prize For Economics 2022: ఈ ఏడాది ఆర్థిక నోబెల్ ముగ్గురు ఎకానమిస్ట్​లను వరించింది. బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్​లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై చేసిన కృషికి గానూ ఈ అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది.  గత సంవత్సరం డేవిడ్ కార్డ్, జాషువా ఆంగ్రిస్ట్ మరియు గైడో ఇంబెన్స్ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. నోబెల్ బహుమతి ప్రకటనలలో ఆర్థిక నోబెల్ చివరిది. తాజాగా దీని ప్రకటనతో ఈ సంవత్సరం అన్ని రంగాల్లో నోబెల్ విజేతలను ప్రకటించినట్లైంది.

అక్టోబర్ 3న స్వీడిష్ శాస్త్రవేత్త స్వాంటే పాబో మానవ పరిణామ క్రమంపై చేసిన కృషికి వైద్య నోబెల్ ప్రకటించారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్​'లో చేసిన పరిశోధనకు గానూ..ఫ్రెంచ్ వ్యక్తి అలైన్ ఆస్పెక్ట్, అమెరికన్ జాన్ ఎఫ్. క్లాజర్ మరియు ఆస్ట్రియన్ అంటోన్ జైలింగర్ లకు భౌతిక నోబెల్ లభించింది. క్లిక్ కెమిస్ట్రీలో చేసిన కృషికి గానూ ఆర్. బెర్టోజీ,  షార్ప్‌లెస్, మోర్టెన్ మెల్డాల్‌లకు రసాయన నోబెల్ దక్కింది. ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకుంది. మానవ హక్కుల కోసం పాటుపడిన  బెలారస్​కు చెందిన అలెస్​ బియాలియాట్స్కీ, రష్యన్ గ్రూప్ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు నోబెల్ శాంతి పురస్కారం దక్కించుకున్నారు. 

ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదగా 1901 నుంచి ఇస్తున్నారు. నోబెల్‌ విజేతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదును బహుమతిగా అందజేస్తారు. ప్రతి ఏటా ఈ అవార్డులను డిసెంబరు 10న అవార్డు గ్రహీతలకు ఇస్తారు. 

Also Read: Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఎవరికి దక్కిందో తెలుసా..? 

Also Read: Nobel Prize in Literature 2022: ఫ్రెంచ్‌ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌కి సాహిత్య నోబెల్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News