Nobel Peace Prize for 2022: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బిలియాట్స్కీ, రష్యా మానవ హక్కుల సంస్థ 'మెమోరియల్' మరియు ఉక్రేనియన్ మానవ హక్కుల సంస్థ 'సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్'లకు సంయుక్తంగా ప్రదానం చేసినట్లు నోబెల్ బహుమతి కమిటీ శుక్రవారం ప్రకటించింది.
''నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు వారి స్వదేశాలలో పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు చాలా సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండాయుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు అధికార దుర్వినియోగాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. సమాజంలో శాంతి, ప్రజాస్వామ్యం కోసం తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నాయి'' అంటూ నోబెల్ కమిటీ వ్యాఖ్యానించింది.
BREAKING NEWS:
The Norwegian Nobel Committee has decided to award the 2022 #NobelPeacePrize to human rights advocate Ales Bialiatski from Belarus, the Russian human rights organisation Memorial and the Ukrainian human rights organisation Center for Civil Liberties. #NobelPrize pic.twitter.com/9YBdkJpDLU— The Nobel Prize (@NobelPrize) October 7, 2022
ఇప్పటికే వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ బహుమతుల విన్నర్స్ ను ప్రకటించారు. అక్టోబర్ 10న ఆర్థిక రంగంలో నోబెల్ విజేత పేరును ప్రకటిస్తారు. నోబెల్ విజేతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు బహుమతిగా ఇస్తారు. ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను డిసెంబరు 10న అందజేస్తారు. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ పురస్కారాలను 1901 నుంచి ప్రదానం చేస్తున్నారు.
Also Read: Nobel Prize in Literature 2022: ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్‌కి సాహిత్య నోబెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook