Order of the Nile: ప్రధాని మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం

order of the nile: ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' అవార్డును అందజేశారు. 'ఆర్డర్ ఆఫ్ ది నైలు' ఈజిప్ట్ యొక్క అత్యున్నత పురస్కారం. ఈజిప్టు అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశానికి ముందు ప్రధాని మోదీకి దీనిని ప్రదానం చేశారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2023, 05:12 PM IST
Order of the Nile: ప్రధాని మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం

Modi Egypt tour: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఈజిప్టు అత్యున్నత పురస్కారం వరించింది. ఈజిప్టు పర్యటనలో ఉన్న మోదీకి 'ఆర్డర్ ఆఫ్ ద నైల్' (Order of the Nile) అవార్డును ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి మోదీకి ప్రదానం చేశారు. ఈ పురస్కారంతో కలిపి ఇప్పటి వరకు 13 దేశాల అత్యున్నత అవార్డులను అందుకున్నారు మోదీ. ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆహ్వానం మేరకే మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. 

ఈజిప్టు టూర్ లో ఉన్న ప్రధాని మోదీ.. పురాతనమైన  అల్‌- హకీం- మసీదు (Al-Hakim Mosque)ను  మసీదును మతపెద్దలతో కలిసి సందర్శించారు.  11వ శతాబ్దానికి చెందిన ఈ మసీదులో ఇటీవల చేపట్టిన పునరుద్ధరణ  పనులను దావూదీ బోహ్రా వర్గానికి తెలియజేశారు.  వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మసీదు 13,560 చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో ప్రధాన ప్రార్థనా మందిరమే ఐదువేల చ.మీ విస్తీర్ణంలో ఉంది. దీనిని ఫాతిమిద్‌కు చెందిన దావూదీ బోహ్రా వర్గం వారు ఇటీవల పునరుద్ధరించారు. ఈ వర్గం జనాభా ఇండియాలో సుమారు 5 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 

మోదీకి లభించిన దేశ అత్యున్నత పురస్కారాలు:
**కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు: పపువా న్యూ గినియా అత్యున్నత పౌర పురస్కారం- మే 2023
**ఎబకల్ అవార్డు: రిపబ్లిక్ ఆఫ్ పలావ్ - మే 2023 
**ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో: భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం- 2021
**లెజియన్ ఆఫ్ మెరిట్ - యుఎస్ - 2020
**కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్-బహ్రెయిన్ అత్యున్నత గౌరవం- 2019
**ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్- మాల్దీవుల అత్యున్నత పురస్కారం -2019
**ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు - రష్యా యొక్క అత్యున్నత పౌర పురస్కారం -2019
**ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -2019
**గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు-  పాలస్తీనా -2018
**స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్- ఆఫ్ఘనిస్తాన్ -2016
**ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్- సౌదీ అరేబియా -2016
సంస్థలు/ఫౌండేషిన్ అందించే అవార్డులు:
** కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ CERA ద్వారా గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డు-2021
**స్వచ్ఛ భారత్ అభియాన్ -2019 కోసం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ గోల్‌కీపర్ అవార్డు
**ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు (UN అత్యున్నత పర్యావరణ గౌరవం) -2018
**సియోల్ శాంతి బహుమతి  -2018

Also read: Modi Egypt Tour: ఈజిప్టులో మోదీ మోదీ నినాదాలు, షోలే పాటతో ప్రధానికి స్వాగతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News