Russia School Shootings: రష్యా స్కూల్లో కాల్పులు.. 13 మంది మృతి, 20 మందికి గాయాలు

Russia Shootings Gunman Suicide: రష్యాలో దారుణం చోటుచేసుకుంది. మధ్య రష్యాలోని ఇజెవ్‌స్కిలో సెక్యురిటీ గార్డును కాల్చిచంపి ఓ స్కూల్‌లోకి చొరబడిన గుర్తుతెలియని ఆగంతకుడు.. అక్కడ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 13 మందిని బలి తీసుకున్నాడు. 

Written by - Pavan | Last Updated : Sep 26, 2022, 04:56 PM IST
  • రష్యా స్కూల్లో కాల్పులకు తెగబడిన గుర్తుతెలియని దుండగుడు..
  • ఆగంతకుడి కాల్పుల్లో 13 మంది మృతి, 20 మందికి గాయాలు
  • కాల్పుల అనంతరం తనని కాల్చుకున్న దుండగుడు
Russia School Shootings: రష్యా స్కూల్లో కాల్పులు.. 13 మంది మృతి, 20 మందికి గాయాలు

Russia Shootings Gunman Suicide: రష్యాలో దారుణం చోటుచేసుకుంది. మధ్య రష్యాలోని ఇజెవ్‌స్కిలో సెక్యురిటీ గార్డును కాల్చిచంపి ఓ స్కూల్‌లోకి చొరబడిన గుర్తుతెలియని ఆగంతకుడు.. అక్కడ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 13 మందిని బలి తీసుకున్నాడు. మరో 20 మంది వరకు దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఏడుగురు స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు. గాయపడిన వారిలోనూ విద్యార్థిని, విద్యార్థులు ఉండటంతో చిన్నారులు, వారి తల్లిదండ్రుల ఆర్తనాధాలతో పాఠశాల పరిసరాలు మార్మోగిపోయాయి. 

స్కూల్‌లో చిన్నారులపై కాల్పులకు తెగబడిన అనంతరం ఆగంతకుడు తనని తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడిన దుండగుడు ధరించిన టీ-షర్టుపై నాజి గుర్తు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన అనంతరం స్కూల్ ని ఖాళీ చేయించిన భద్రతా బలగాలు.. పాఠశాల సహా అక్కడి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టాయి. దుండగుడు ఎవరు ? అతడి లక్ష్యం ఏంటి ? దుండగుడికి ఏవైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా ? స్కూల్‌తో అతడికి గతంలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? చిన్నారులు అనే దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా ఇంత విచక్షణారహితంగా దాడికి పాల్పడటానికి కారణం ఏంటి అనే కోణాల్లో రష్యా భద్రతా బలగాలు విచారణ చేపట్టాయి. 

రష్యా స్కూల్‌లో కాల్పులకు తెగబడిన నిందితుడి వద్ద నుండి రెండు నాన్-లెథల్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో పలువురు టీచర్లు, ఇద్దరు సెక్యురిటీ గార్డులు కూడా ఉన్నారని బీబీసీ వార్తా కథనం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను పరిశీలిస్తే.. తరగతి గదిలో నేలపై రక్తపు మరకలు, కిటికి అద్దాల్లోంచి తుపాకీ బుల్లెట్ దూసుకుపోయిన ఆనవాళ్లు, తరగతి గదిలో డెస్కుల కింద తలదాచుకుని ఆర్తనాధాలు పెడుతున్న విద్యార్థులు దృశ్యాలు ఉన్నాయి. రష్యా రాజధాని మాస్కోకు దాదాపు 960 కిమీ దూరంలో ఉరల్ రీజియన్‌లోని ఇజెవ్‌స్కి నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : Pakistan army helicopter crash: పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి.. ఆరుగురు దుర్మరణం..!

Also Read : Bangladesh Accident: బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం..24 మంది మృతి..పలువురు గల్లంతు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News