Pakistan army helicopter crash: పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి.. ఆరుగురు దుర్మరణం..!

Pakistan army helicopter crash: సోమవారం పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ఆరుగురు సైనికులు దుర్మరణం చెందారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2022, 01:27 PM IST
Pakistan army helicopter crash: పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి.. ఆరుగురు దుర్మరణం..!

Pakistan army helicopter crash: సోమవారం పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్‌లతో సహా ఆరుగురు సైనికులు మృతి చెందారు. హెలికాప్టర్‌లో ఇద్దరు మేజర్ ర్యాంక్ అధికారులు ఉన్నట్లు సమాచారం. గత అర్థరాత్రి హర్నై బలూచిస్థాన్‌లోని ఖోస్ట్ సమీపంలో ఫ్లయింగ్ మిషన్ సమయంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను పాకిస్థాన్ ఆర్మీ ధృవీకరించంది. బెలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు ఉత్తరాన 150 కిలోమీటర్లు (90 మైళ్లు) దూరంలో ఉన్న హెర్నై జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని స్థానిక అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

గత నెల ప్రారంభంలో ఇదే విధంగా పాకిస్తాన్ సైనిక హెలికాప్టర్ (Pakistan army helicopter crash) బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కూలిపోయింది. బలూచిస్తాన్‌లో లాస్‌బెలాలో వరద సహాయక చర్యల్లో ఉండగా సాంకేతిక లోపంతో ఈ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందులో ఒక టాప్ ఆర్మీ కమాండర్ కూడా ఉన్నారు. 

రెండు నెలలుగా పాకిస్థాన్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల్లో 1600 మందికిపైగా మరణించారు. ప్రస్తుతం ఆ దేశం అపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. మన దేశం సాయం చేయడానికి ముందు వస్తే దానిని తిరస్కరించింది. మిగతా దేశాలు ఏయే పాకిస్తాన్ ను అదుకునేందుకు ముందుకు రావట్లేదు. ఐఎంఎఫ్ కొంత మెుత్తంలో నిధులను విడుదల చేసింది. 

Also Read: Bangladesh Accident: బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం..24 మంది మృతి..పలువురు గల్లంతు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News