China: నూడిల్స్‌‌ తిని కుటుంబంలో 9 మంది మృతి

family members dies in China after eating noodles | నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కుటుంబసభ్యులు మృత్యువాతపడ్డారు. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా.. చైనాలోని హీలాంగ్జియాంగ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

Last Updated : Oct 22, 2020, 01:50 PM IST
China: నూడిల్స్‌‌ తిని కుటుంబంలో 9 మంది మృతి

చైనాలోని హీలాంగ్జియాంగ్‌లో దారుణం చోటుచేసుకుంది. నూడుల్స్ తిని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కుటుంబసభ్యులు మృత్యువాతపడ్డారు. వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా.. చైనా (China)లో ఈ అక్టోబర్ 10న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగుచూసింది. సుయాన్ టాంగ్ జి అనే నూడిల్స్ వంటకం తిన్న 9 మంది కొన్ని రోజులపాటు తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు.

ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్‌ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం అక్టోబర్ 5న నూడుల్స్‌తో ఓ వంటకం చేసింది. మొత్తం కుటుంబంలో 12 మంది ఉండగా.. 9 మంది సుయాన్ టాంగ్ జి అనే నూడిల్స్ వంటకం తిన్నారు. రుచి చూస్తే ఏదో తేడా కొడుతుందని మిగతా ముగ్గురు కుటుంబసభ్యులు ఆ వంటకాన్ని తినలేదని సమాచారం. ఈ క్రమంలో వంటకం తిన్న వెంటనే తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 5 రోజుల తరువాత అక్టోబర్ 10న ఏడుగురు చనిపోయారు. మరో రెండు రోజులకు 8వ మరణం సంభవించింది. ఈ సోమవారం 9వ వ్యక్తి చనిపోయారని చైనా మీడియా రిపోర్ట్ చేసింది.  

 

ఈ విషాద ఘటనపై చైనా అధికారులు స్పందించారు. బాంగ్‌క్రెకిక్ అనే అమ్లం కారణంగా పదార్థం విషపూరితమైందని తెలిపారు. అయితే ఏడాదికి పైగా ఫ్రీజర్‌లో ఉంచిన పదార్ధాన్ని కలిపి, నూడుల్స్ వంటకం చేయడంతో మొత్తం విషపూరితమై ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. బాంగ్‌క్రెకిక్ లాంటి పదార్థాలు త్వరగా శరీరంపై ప్రభావం చూపుతాయి. అందుకు వినియోగ కాలం మించిపోయిన పదార్థాలు తినకూడదని ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి హెచ్చరించారు. ముఖ్యంగా బాంగ్‌క్రెకిక్ లాంటి పదార్థాలు వేడి చేసినా అనారోగ్యానికి దారితీస్తాయని, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News