ట్రంప్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన ఐరాస

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హైతీ, ఎల్‌సాల్వడర్‌తో పాటు పలు ఆఫ్రికా దేశాలపై చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలను ఐక్యరాజసమితి మానవ హక్కుల కార్యాలయం ఖండించింది.

Updated: Jan 13, 2018, 02:01 PM IST
ట్రంప్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన ఐరాస

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హైతీ, ఎల్‌సాల్వడర్‌తో పాటు పలు ఆఫ్రికా దేశాలపై చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలను ఐక్యరాజసమితి మానవ హక్కుల కార్యాలయం ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమెరికాలో మైనారిటీలపై దాడులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 

ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై అమెరికాలోని డెమొక్రటిక్ పార్టీ స్పందించింది. ఈ వ్యాఖ్యలు ట్రంప్ అసలు స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నాయని తెలిపింది. అయితే ఇదే అంశంపై ట్రంప్ వాదన వేరే విధంగా ఉంది. ఆయా దేశాలపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన తెలిపారు. ఇది ప్రతిపక్షం చేస్తున్న కుట్రగా భావించాలన్నారు.

కాగా, తమ దేశంలో చెత్త దేశాలకు చెందిన పౌరులకు చోటు లేదని, అందుకు బదులుగా అమెరికాకి ఆర్థికంగా ఉపయోగపడే పలు ఆసియా దేశాల నుండి వలసలను ప్రోత్సహించవచ్చని, ట్రంప్ చెప్పినట్లు కొన్ని అమెరికన్ పత్రికలు రాశాయి.