Russian victory day parade: రష్యన్ విక్టరీ డే పేరేడ్‌లో ఇండియా దేనికి సంకేతం ?

India vs China: ఇండో చైనా సరిహద్దులో ( Indo china border ) తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్‌కు రష్యా నుంచి సహకారం అందుతుందా ? ఇవాళ మాస్కోలో జరిగిన రష్యన్ డే పరేడ్‌లో ( Russian victory day parade ) భారత ఆర్మీ పాల్గొనడం దేనికి సంకేతాలిస్తోంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Last Updated : Jun 24, 2020, 04:37 PM IST
Russian victory day parade: రష్యన్ విక్టరీ డే పేరేడ్‌లో ఇండియా దేనికి సంకేతం ?

India vs China: ఇండో చైనా సరిహద్దులో ( Indo china border ) తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్‌కు రష్యా నుంచి సహకారం అందుతుందా ? ఇవాళ మాస్కోలో జరిగిన రష్యన్ డే పరేడ్‌లో ( Russian victory day parade ) భారత ఆర్మీ పాల్గొనడం దేనికి సంకేతాలిస్తోంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యా విక్టరీ డే పేరేడ్ 2020లో ఇవాళ్టి రోజు చాలా ప్రత్యేకం. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా బలిదానం, మిత్రదేశాల విజయానికి చిహ్నంగా ఈ పెరేడ్‌ను జరుపుతారు. విక్టరీ పేరేడ్‌లో ఈసారి భారత్‌కు చెందిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాలు హాజరయ్యాయి. మరో 11 దేశాల సైనికులు కూడా పాల్గొన్నప్పటికీ.. ఈ ఉత్సవాల్లో ఇండియా పాల్గొనడమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

రష్యా రాజధాని నగరమైన మాస్కోలో ఈ పేరేడ్ నిర్వహించారు. 1945 రెండో ప్రపంచయుద్ధంలో ( second world war ) ఇవాళ్టి రోజున రష్యా.. జర్మనీను ఓడించి 75 ఏళ్లు గడిచాయి. ఈ యుద్ధంలో రష్యా బలిదానంతో పాటు ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతదేశం ఆ సమయంలో రెండో ప్రపంచయుద్ధంలో  జర్మనీకి ( Germany ) వ్యతిరేకంగా పాల్గొంది. ఈ యుద్ధంలో దాదాపు 20 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొనడమే కాకుండా...పెద్ద ఎత్తున ఆంగ్లేయులకు దేశంలోని వివిధ సంస్థానాలు నిధులు కూడా సమకూర్చాయి.

దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Defence minister Rajnath singh ) సైతం ఈ పేరేడ్‌లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే... సరిగ్గా ప్రస్తుతం చైనాతో భారతదేశానికి వివాదం నెలకొంది. రష్యాతో భారత్‌కు ఉన్న పాత స్నేహం నేపధ్యంలో చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తితే.. ఆ యుద్ధంలో భారత్‌కు రష్యా సహకారం అందిస్తుందని ఇప్పటికే పరిశీలకులు భావిస్తున్నారు. సరిహద్దు వివాదంలో చైనాకు కేవలం భారత్‌తోనే కాదు ... అటు రష్యాతోనూ వివాదం ఉంది. అందుకే భారత్-చైనా మధ్య యుద్దమే జరిగితే.. సరిహద్దు వద్ద చైనాను ఇరుకున పెట్టే వ్యూహాన్ని రష్యా రచిస్తే... భారత్‌కు ప్రయోజనకరంగా మారవచ్చనేది యుద్ధ నిపుణుల అంచనాగా ఉంది. అందుకే ఇప్పుడు రష్యన్ పేరేడ్‌లో భారత్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం తరపున మొత్తం 75 మంది సైనికాధికారులు ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.

Trending News