Winter Storm in US: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 34కి చేరిన మృతుల సంఖ్య

US winter Storm Effects: అమెరికాలో మంచు తుఫాన్ ప్రభావంతో అక్కడి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. మంచు గడ్డలతో పరిస్థితి భయానకంగా మారింది. లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు 34 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 08:55 AM IST
Winter Storm in US: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. 34కి చేరిన మృతుల సంఖ్య

US winter Storm Effects: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో అక్కడి మృతుల సంఖ్య 34కి చేరినట్లు తెలుస్తోంది. గడ్డకట్టే చలితో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు ఎనిమిది లక్షల మందికి విద్యుత్‌ సరఫరా లేదు. 48 రాష్ట్రాలలో గాలి చలి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం 2,700 కంటే ఎక్కువ దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. శుక్రవారం 5 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. 

రైలు, రోడ్డు ట్రాఫిక్‌పై కూడా మంచు తుఫాన్ తీవ్ర ప్రభావం పడింది. కెనడా సమీపంలోని గ్రేట్ లేక్స్ నుంచి మెక్సికన్ సరిహద్దు సమీపంలోని రియో ​​గ్రాండే వరకు హరికేన్లు తాకాయి. అమెరికా జనాభాలో దాదాపు 60 శాతం మంది చలి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం.. రాకీ పర్వత శ్రేణి నుంచి తూర్పున అప్పలాచియన్స్ వరకు చాలా ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే బాగా పడిపోయాయి. ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలోంకార్జ్ బఫెలోతో సహా ఏరియా కౌంటీలో మంచు తుఫాను కొనసాగవచ్చని నిపుణులు చెప్పారు.

పశ్చిమ న్యూయార్క్‌లో అత్యవసర పరిస్థితిని విధించారు. అంతకుముందు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ పశ్చిమ న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాలలో ఎరీ సరస్సు, అంటారియో సరస్సు  తూర్పు చివరతో సహా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో అన్ని రకాల వాహనాలను నిషేధించారు. పశ్చిమ న్యూయార్క్‌లో ఏడుగురు మరణించగా.. ఇతర రాష్ట్రాల్లో 27 మంది మరణించారు. ఇక్కడ భయంకరమైన మంచులు గడ్డలు, భారీ గాలులతో పరిస్థితి అల్లకల్లోంగా మారింది. 

కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలోన్‌కార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎరీ కౌంటీలో తుఫాను ఫలితంగా ఏడుగురు మరణించారని.. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని అన్నారు. అక్కడి భయంకరమైన పరిస్థితులను ఆయన వివరించారు. గంటల తరబడి మంచు తుఫాన్ కురిసిందన్నారు. మృతదేహాలు కార్లలో, మంచు గడ్డల కింద గుర్తించినట్లు చెప్పారు.

Also Read: Wife Beat Husband: భర్త ఫోన్‌లో అలాంటి ఫొటోలు.. ఎయిర్‌పోర్టులో ఈడ్చుకెళ్లి కొట్టిన భార్య

Also Read: Pm Kisan Yojana: రైతులకు భారీ బహుమతి.. ఖాతాలోకి నేరుగా రూ.15 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News