Wife Beat Husband At Airport: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు సహాజం. మాటకు మాట అనుకోవడం.. ఆపై సర్దుకోవడం కామన్. కొన్ని తప్పులను చూసీ చూడనట్లు సరేలే అనుకుని వదిలేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం తన భర్త ఫోన్‌లో ఫొటోలను చూసి ఊరికే వదిలేయదు. ఎయిర్‌పోర్టులో అందరి ముందే చితక్కొట్టింది. చుట్టుపక్కల వాళ్లు, పోలీసులు వచ్చి విడిపించినా భర్తను వదిలిపెట్టలేదు. ఆమెకు కోపానికి కారణం ఏంటి..? ఇంతకు భర్త ఫోన్‌లో ఏమున్నాయి..? పూర్తి వివరాలు ఇలా..
అమెరికాలోని సౌత్ కరోలినాలోని విమానాశ్రయంలో భార్యాభర్తలిద్దరూ క్రిస్మస్ పార్టీ కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు. తన భర్తను ఫోన్ ఇవ్వాలని ఆమె అడిగింది. అతను ఫోన్ ఇవ్వగా.. లాక్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసిన ఆమె షాక్‌కు గురైంది. భర్త ఫోన్‌లో ఇతర మహిళల అభ్యంతర ఫొటోలు చూసి కోపం కట్టలు తెంచుకుంది. దీంతో అనూహ్యంగా భర్తను దొరికిన వస్తువుతో కొట్టింది. ముందుగా ఫోన్ విసిరి భర్తపై దాడికి దిగింది. ఆ తర్వాత ఫోన్‌ని తీసుకుని మరోసారి నేలపై కొట్టింది.
భార్యాభర్తల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఎప్పుడు ఘర్షణగా మారిందో అక్కడున్న వారికి అర్థంకాలేదు. గొడవను చూసిన భద్రతా సిబ్బంది వారిని విడదీయడానికి ప్రయత్నించారు. అయినా ఆమె మాత్రం వదలకుండా భర్తను ఈడ్చుకెళ్లి మరీ కొట్టింది. కాసేపటి తరువాత స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భర్త కోరిక మేరకు ఆమెను వదిలిపెట్టారు. అక్కడ భర్తకు సూచనలు ఇవ్వడంతో విడుదల చేశారు.
భర్తపై దాడి చేసిన మహిళను 55 ఏళ్ల పౌలా బార్బర్‌గా గుర్తించారు. ఈ కేసులో ఆమె మరుసటి రోజు బెయిల్ బాండ్ నింపడం ద్వారా బయటకువచ్చింది. మరోసారి తన భర్తతో అలా ప్రవర్తించనని కోర్టులో హామీ ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న పౌలా మళ్లీ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.
Also Read: Guntur: ఆమె కళ్లలో ఆనందం కోసం పక్కా స్కెచ్.. అతితెలివి ఉపయోగించి చివరికి..
Also Read: Pm Kisan Yojana: రైతులకు భారీ బహుమతి.. ఖాతాలోకి నేరుగా రూ.15 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook