Bharat Bandh in AP: రైతన్నల భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Bharat Bandh in AP: డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల బంద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు.

Last Updated : Dec 7, 2020, 10:05 PM IST
  • భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం పరోక్ష మద్దతు
  • విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ మూసివేయాలని ఆదేశించిన ప్రభుత్వం
  • తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ
Bharat Bandh in AP: రైతన్నల భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Bharat Bandh in AP: డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల బంద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ ( Central Government ) వ్యవసాయ చట్టాలకు ( Agriculture acts ) వ్యతిరేకంగా డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలంటూ దాదాపు 11 రోజులుగా రైతులు సమ్మెకు దిగారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా రైతులు చేరుకుని నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా డిసెంబర్ 8వ తేదీన దేశవ్యాప్త బంద్  తలపెట్టారు. రైతుల తలపెట్టిన భారత్ బంద్‌కు ( Bharat Bandh ) దేశంలోని వివిధ పార్టీలు , ప్రభుత్వాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. 

మొన్నటివరకూ బంద్‌కు మద్దతివ్వమని చెప్పిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamat Benerjee ) కూడా..మద్దతిస్తున్నామని ప్రకటించారు. అటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind kejriwal ) కూడా మద్దతు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ప్రకటించాయి. నిన్నటి వరకూ బంద్ విషయంలో వైఖరి స్పష్టం చేయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన స్టాండ్ ఏంటనేది చెప్పింది. రైతుల తలపెట్టిన భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం ( Ap Government ) పరోక్షంగా మద్దతిస్తుందని మంత్రి కన్నబాబు తెలిపారు. Also read: Eluru Mysterious Disease: ఏలూరులో వింత వ్యాధి.. WHO సహాయం కోరిన జగన్

ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఎస్ఆర్టీసీ , ప్రభుత్వ కార్యాలయాల్ని మధ్యాహ్నం ఒంటి గంట తరువాతే తెరవాలని సూచించింది. రైతులు, రైతు సంఘాల ఆందోళనల్ని ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. రైతుల మనోభావాలకు ప్రభుత్వం గౌరవమిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ( Minister Kannababu ) తెలిపారు. రైతు ప్రయోజానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం చెప్పడంతోనే వైసీపీ ప్రభుత్వం బిల్లులకు మద్దతిచ్చిందన్నారు. 

భారత్ బంద్ ఉదయం 11 గంటల్నించి మద్యాహ్నం 3 గంటల వరకూ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల్నించి యధావిధిగా పనులు చేసుకోవచ్చు. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ఏపీఎస్సార్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కవు. ఇక ప్రతిపక్షం తెలుగుదేశం మాత్రం తటస్థంగా ఉండనుంది. బంద్‌లో పాల్గొనకుండా..కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనుంది. Also read: Eluru mystery disease: అంతుచిక్కని ఏలూరు వింత వ్యాధి లక్షణాలు..జాగ్రత్తలు

Trending News