Prime Minister Fasal Bima yojana: తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా రైతులకు నరేంద్ర మోడీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలు, అనావృష్టి కారణంగా పంట నష్టం వాటిల్లే రైతుల కోసం ఫసల్ బీమా యోజన తీసుకొచ్చింది. తాజాగా ఇందులో పేరు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15 చివరి గడువు. తాజాగా ఆ గడువును పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
No Insurance No Fuel: దేశంలో ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న వెహికల్స్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సరైన రక్షణ లేని వాహనాలను అడ్డుకునేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దేశవ్యాప్తంగా థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ లేని వెహికల్స్ కు పెట్రోల్, డీజిల్ పోయడాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్ అనే రూల్ తీసుకురావాలని ఆదేశించింది.
Central Government: ఖరీఫ్, రబీ సాగు సీజన్లలో అన్నదాతలకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా ఉండేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఎరువుల లభ్యత వివరాలు పార్లమెంటులో చర్చకు వచ్చింది. దేశవ్యాప్తంగా సాగు చేసే ప్రతి రైతుకు సమయానికి తగిన మోతాదులో యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్ పీకేఎస్ వంటి ప్రధాన ఎరువులు అందుబాటులో ఉండేలా ఎరువుల మంత్రిత్వ శాఖ పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోందని తెలిపింది.
Central Government Approvals Waranga Airport: కేంద్రం దేశ వ్యాప్తంగా పలు కొత్త నగరాలకు ఎయిర్‌పోర్ట్‌లకు మంజూరు చేస్తోంది. తాజాగా వరంగల్ మంనూర్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
Telegram Anti Piracy Notice: టెలిగ్రామ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సదరు యాప్ ద్వారా పైరసీ సినిమా, ఓటీటీ కంటెంట్‌ను యధేచ్చగా షేర్ చేస్తుండడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టెలిగ్రామ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తూ యాప్ లేదా ప్లాట్‌ఫారమ్ స్థాయిలోనే పైరసీ నిరోధక చర్యలు చేపట్టాలని సూచించింది.
Metro Loan: హైదరాబాద్ మెట్రో అప్పులు తెలంగాణ సర్కారును ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరుచేసిన రుణం ఖాతాలో జమకావడంలో జాప్యం జరుగుతోంది. IRFC రుణ మంజూరు నిధుల విషయంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మెట్రోకు వచ్చే రుణ మొత్తాన్ని వాయిదాల చెల్లింపు, నిర్వహణ ఖర్చుల్లో ప్రాధాన్యతపై స్పష్టతలేమి సర్కారుకు సంకటంగా మారింది. IRFC రుణంతో తెలంగాణ సర్కారుకు వచ్చిన చిక్కు ఏంటి? రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధమేంటి? ఇది సాంకేతిక సమస్యనా? పొలిటికల్ ప్రాబ్లమా? ఇంతకీ ఏం జరుగుతుంది.
Telangana Population: దేశ వ్యాప్తంగా దాదాపు 2011 తర్వాత దాదాపు 16 యేళ్ల తర్వాత జనగణన జరుగుతోంది. మధ్యలో 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఈ యేడాది ఏప్రిల్ 1న జనగణన మొదలైంది. ఈ గణన వచ్చే యేడాది మార్చి 31న ముగించి ఆ తర్వాత ప్రభుత్వం పూర్తి వివరాలతో గెజిట్ విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో జరిగిన జనగణనలో రాష్ట్ర జనాభా 4.20 కోట్లు దాటినట్లు అధికారులు చెబుతున్న మాట.
DA Hike July 2026: ఎనిమిదవ వేతన సంఘం.. కొంతకాలంగా ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా ఉంది. అయితే 8వ వేతన సంఘం ప్రయోజనాలు అందకముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డీఏ పెంపు ఉంటుందని తెలుస్తోంది. ద్రవ్యోల్బణ గణాంకాలు 3శాతం డిఏ పెంపుపై ఆశలను పెంచుతున్నాయి.
Supreme Court on Census 2027: జనగణనలో ఈ సారి కులాలను చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులాల గణనపై కొంత మంది కోర్టు గడప తొక్కారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. జనగణనలో కులగణనకు లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి 100 శాతం వాటాను గవర్నమెంట్ కొనుగోలు చేసింది.
New Labour Code: జీతాలు తక్కువ.. పని భారం ఎక్కువ.. దీనిపై నోయిడా కార్మికులు భారీ నిరసన చేపట్టారు. కొత్త కార్మిక చట్టంలో సకాలంలో జీతాలు, రెట్టింపు ఓవర్ టైమ్ వంటి పరిష్కారాలు ఉన్నా..కార్మిక రంగం ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల రాష్ట్రాలు నిబంధనలు రూపొందించడంలో చాలా ఆలస్యం చేస్తున్నాయి. ఫలితంగా ఈ చట్టాల అమల్లో జాప్యం జరుగుతోంది. న్యూ లేబర్ కోడ్ నిబంధనకు కేంద్రం ఒకే చెప్పినా.. కొన్ని రాష్ట్రాలు ఎందుకు నో చెబుతున్నాయి. అసలు నిబంధనలేంటీ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Good News for PF Account Holders: ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది వడ్డీ మొత్తాన్ని గతంలో కంటే వేగంగా.. రికార్డు సమయంలో ఖాతాదారుల అకౌంట్లలో జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 7 కోట్ల మందికి పైగా ఉన్న ఈపీఎఫ్ సభ్యులకు మే-జూన్ నాటికి వడ్డీ సొమ్ము అందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Census 2027: దేశ వ్యాప్తంగా జనగణన అధికారికంగా ప్రారంభమైంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా డిజిటల్ లో తమ వివరాలతో పాటు కుటుంబ వివరాలను నమోదు చేశారు.
Centre Clarifies on EPS-95 Pension Hike: ప్రైవేట్ రంగ ఉద్యోగుల పదవీ విరమణ జీవితానికి భరోసానిచ్చే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ EPS-95 విషయంలో కేంద్ర ప్రభుత్వం తన పంథాను స్పష్టం చేసింది. పెన్షన్‌ను వాస్తవ మూల వేతనంతో (Actual Basic Salary) ఎటువంటి పరిమితి లేకుండా ముడిపెట్టాలన్న డిమాండ్లను ప్రభుత్వం ప్రస్తుతానికి తోసిపుచ్చింది. 2026 మార్చి 30న లోక్‌సభలో ఎంపీ గిరిధారి యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు
Small Savings Interest Rates: పాత లాభాలే.. కొత్త ఉత్సాహం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం ఖరారు చేసింది. సుకన్య సమృద్ధి (8.2శాతం), పీపీఎఫ్ (7.1శాతం), ఎన్ఎస్సీ (7.7శాతం) రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా ఉంచింది. వరుసగా ఎనిమిదోసారి రేట్లను మార్చకపోవడంతో స్థిరమైన ఆదాయం కోరుకునే మధ్యతరగతి మదుపరులకు ఇది పెద్ద ఊరట అని చెప్పాలి.
epf esi pension for unorganized workers: దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అసంఘటిత రంగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు కేవలం కార్పొరేట్.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే పరిమితమైన ఈపీఎఫ్ఓ , ఈఎస్ఐసీ సేవలను ఇకపై సామాన్య కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు కూడా అందించాలని మోదీ సర్కార్ భావిస్తోంది.
War Effect on India: పశ్చిమాసియాలో తలెత్తిన ఘర్షణలు దేశం పై పను ప్రభావం చూపిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే.. భారత ప్రభుత్వం ఎల్పీజీ, పెట్రోల్ సరఫరాకు ఆటంకం లేకుండా చేస్తోంది. తగినంత పెట్రో నిల్వలున్నా.. మరోవైపు కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు బంద్ కావడంతో ప్రజలు ఒక్కసారిగా ప్యానిక్ మోడ్ లోకి వెళ్లడంతో అన్ని చోట్ల చాంతాంత క్యూలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
LPG Gas Shortage News: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌తో చర్చలు జరిపి భారత్‌కు ముడిచమరు, గ్యాస్ తీసుకురావడంలో దౌత్యం ఫలించింది. తాజాగా అందుకు సంబంధించిన నౌకలు కూడా భారత్‌కు సురక్షితంగా చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఓ కీలక ప్రకటన చేసింది.
3 Months Free Ration: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ అనగా ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించి ఉచితంగా ఇచ్చే రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
National Livestock Mission: దేశంలో గాడిదల సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. దీంతో వాటి సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. National Livestock Mission (NLM) పథకం ద్వారా గాడిదల పెంపకానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం గాడిదలతో పాటు గుర్రాలు, ఒంటెల పెంపకాన్నీ ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా స్వదేశీ జాతుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.
Fact Check: ఆర్బీఐ పేరిట పాత నాణేలకు రూ.34 లక్షలు ఇస్తామని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా ఫేక్. ముందుగా ఫీజులు చెల్లించాలంటూ డబ్బులు వసూలు చేయడం స్కామ్ లో ఇదొక్కటి. రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ ఇలాంటి ఆఫర్లు ఇవ్వదని గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
Visakhapatnam Vijayawada Metro Funding: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు వచ్చాయి.