AP Formation Day: జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు (AP Formation Day) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి.

Last Updated : Nov 1, 2020, 11:29 AM IST
AP Formation Day: జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

Andhra Pradesh Formation Day celebrations: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు (AP Formation Day) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (CM Y. S. Jaganmohan Reddy ) ఆదివారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిన వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సీఎం జగన్ తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేడుకలు (Andhra Pradesh Formation Day celebrations) ప్రారంభమయ్యాయి.  

అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాంకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) త్యాగ ఫలితంగా రాష్ట్రం ఎర్పడిందని వివరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర  సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడతామని ఆయన పేర్కొన్నరు. వివక్ష, అవినీతికి తావులేకుండా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి పాలన అందిస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.  Also read: Doraikkannu: కరోనాతో తమిళనాడు వ్యవసాయ మంత్రి కన్నుమూత

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని గవర్నర్ తెలిపారు. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. 

 

Trending News