Doraikkannu: కరోనాతో తమిళనాడు వ్యవసాయ మంత్రి కన్నుమూత

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సైతం కరోనాబారిన పడి కన్నుమూశారు.

Last Updated : Nov 1, 2020, 08:53 AM IST
Doraikkannu: కరోనాతో తమిళనాడు వ్యవసాయ మంత్రి కన్నుమూత

Tamil Nadu agriculture minister doraikkannu passes away: చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా (Covid-19) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సైతం కరోనాబారిన పడి కన్నుమూశారు. త‌మిళ‌నాడు (Tamil Nadu) వ్య‌వ‌సాయశాఖ మంత్రి దొరైక్క‌న్ను (72) (R. Doraikkannu) క‌రోనా బారిన పడి గ‌త కొంత‌కాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయ‌న ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో శనివారం రాత్రి 11.15 గంట‌ల‌కు క‌న్నుమూశారు. 

అయితే.. అక్టోబ‌ర్‌ 13న శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌తుండటంతో.. దొరైక్కన్నును విల్లుపురం ప్ర‌భుత్వ ఆసుపత్రి తరలించారు. ఆతర్వాత మెరుగైన చికిత్స కోసం కావేరీ ప్రైవేటు ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆయనకు కరోనా (Coronavirus) ఉన్నట్లు నిర్థారణ కావడవంతో అప్పటినుంచి ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.  

ఇదిలాఉంటే.. 1948లో తమిళనాడులోని తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్ను జన్మించారు. ఆయన మూడు సార్లు అన్నా డీఎంకే (AIADMK)పార్టీ నుంచి పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అనంతరం 2016లో సీఎం పళ‌నిస్వామి కేబినెట్‌లో దొరైక్కన్ను వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి (Tamil Nadu agriculture minister doraikkannu) గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ‌

Trending News