Kurnool Jobs: ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్ ట్రస్ట్‌‌లో ఉద్యోగాలు

aarogyasri trust jobs 2020 Kurnool | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడ‌ర్ పోస్టులకు రూ.15,000 మేర నెల వేతనం అందనున్నాయి.

Last Updated : Nov 1, 2020, 05:05 PM IST
Kurnool Jobs: ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్ ట్రస్ట్‌‌లో ఉద్యోగాలు

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 648 పోస్టులు భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 59 (ఆరోగ్య మిత్ర 57, టీం లీడర్ 2 పోస్టులు) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టారు. తగిన అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

పోస్టులు ఆధారంగా అర్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మసీ, ఫార్మా-డి, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ (న‌ర్సింగ్) విద్యార్హత‌, కంప్యూట‌ర్ స్కిల్స్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడ‌ర్ పోస్టులకు రూ.15,000 మేర వేతనం అందనుంది. 

 

నోటిఫికేషన్ 

దరఖాస్తు తుది గడువు : నవంబర్ 2
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. డీడీ తీసి పంపాలి

 

ఆరోగ్య మిత్ర అప్లికేషన్ ఫామ్ కోసం క్లిక్ చేయండి

టీ లీడర్ అప్లికేషన్ ఫామ్ కోసం క్లిక్ చేయండి

అధికారిక వెబ్‌సైట్

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.300 ఈ కింది పేరు మీద డీడీ తీయాలి.
District Medical and Health Officer, KURNOOL district

 

అప్లికేషన్, డీడీ పంపాల్సిన చిరునామా
the District Medical & Health Officer, KURNOOL

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News