APPSC Group 2 Results: ఏపీ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఎంపికైంది వీరే

APPSC Group-2 Result : రెండేళ్ల కాల వ్యవధిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇంకా ఖాళీలు ఏమైనా ఉంటే వాటికి మెయిన్స్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు APPSC అధికారులు చెబుతున్నారు.

Last Updated : Oct 30, 2020, 12:53 PM IST
APPSC Group 2 Results: ఏపీ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఎంపికైంది వీరే

APPSC Group-2 Results |  ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. మొత్తం 423 మంది అభ్యర్థులను గ్రూప్ 2 సర్వీసులకు ఎంపిక చేసింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విభాగాల వారీగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌   https://psc.ap.gov.in/లో అందుబాటులో ఉంచింది.

 

ప్రస్తుతం ఈ విభాగాలలో పోస్టులను భర్తీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, డిప్యూటీ తహసీల్దారు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1 (దేవాదాయ శాఖ), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు (ఏపీ సచివాలయం), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌ సొసైటీ), ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, జూనియర్‌ అసిస్టెంట్స్‌, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌,  అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (పంచాయతీరాజ్‌), సీనియర్‌ ఆడిటర్‌ (రాష్ట్ర ఆడిట్‌ సబార్డినేట్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), జూనియర్‌ అసిస్టెంట్‌ (ఏపీపీఎస్సీ) విభాగాలలో 423 మందికి పోస్టింగ్ ఇచ్చారు.  

ఏపీ గ్రూప్-2 సర్వీసులకు ఎంపికైన వారి జాబితా కోసం క్లిక్ చేయండి
 

రెండేళ్ల కాల వ్యవధిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇంకా ఖాళీలు ఏమైనా ఉంటే వాటికి మెయిన్స్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News