TDP vs YCP: చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

TDP vs YCP: విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధం కొనసాగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వంశీ, మంత్రి నాని వర్సెస్ చంద్రబాబు అండ్ కో  మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Last Updated : Jan 19, 2021, 02:31 PM IST
TDP vs YCP: చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడిన టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

TDP vs YCP: విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ యుద్ధం కొనసాగుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వంశీ, మంత్రి నాని వర్సెస్ చంద్రబాబు అండ్ కో  మధ్య ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాజకీయ ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. తెలుగుదేశం, వైసీపీ నేతల మధ్య నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయికి చేరుకున్నాయి ఆరోపణలు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రారంభమైన వివాదం రాజుకుంటోంది. మంత్రి కొడాలి నాని ( Minister Kodali Neni ), టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Vallabhaneni Vamshi ) వర్సెస్ దేవినేని ఉమ ( Devineni Uma ) ల మధ్య వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు అధికమౌతున్నాయి.

ఎన్టీఆర్ వర్ధంతి ( NTR Vardhanti ) సందర్భంగా మరోసారి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తెలుగువాడి చరిత్రని దేశంలోనే లిఖించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని..రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని టీడీపీ రెబెల్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ( Chandrababu ), వదినను చంపిన దేవినేని ఉమలు రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చర్చకోసం ప్లేస్ , టైమ్, డేట్ ఉమనే ఫిక్స్ చేయాలని వంశీ సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇస్తే..ప్రజలు కోసి కారం పెట్టిన సంగతి గుర్తు లేదా అని ప్నశ్నించారు.

తెలుగుదేశం ( Telugu Desam ) నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అసంబద్ధమైన ఆరోపణలతో చర్చకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ టీడీపీ వేరు, చంద్రబాబు టీడీపీ వేరని స్పష్టం చేశారు. తాము పిలిచింది చర్చకే గానీ..కోట్లాటకు కాదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ( Tdp Government ) లో జరిగిన అవినీతి గురించి తనకు పూర్తిగా తెలుసన్నారు. దేవినేని ఉమ ఒక లోఫర్ అనే సంగతి అందరికీ తెలుసని చెప్పారు. తన ఇంట్లో అనేక కులాలున్నాయని..అన్ని కులాలు ఓట్లేస్తేనే తాను, నాని ఎమ్మెల్యేలుగా గెలిచామని తెలిపారు. ఉమ ఇప్పటికైనా  పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. 

Also read: AP: ఆ పిటీషన్ ఆమోదయోగ్యంగా లేదు: హైకోర్టులో వాదన విన్పించిన ఏజీ శ్రీరామ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News