Chandrababu Naidu: భోగి వేడుకల్లో చంద్రబాబు.. జీవో ప్రతుల దహనం

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నిచోట్ల నాయకులు, ప్రజలు భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2021, 08:58 AM IST
Chandrababu Naidu: భోగి వేడుకల్లో చంద్రబాబు.. జీవో ప్రతుల దహనం

Chandrababu Naidu participates in Bhogi festival | అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నిచోట్ల నాయకులు, ప్రజలు భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లాలోని పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక జీఓల కాపీలను చంద్రబాబు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. Also Read: Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీం స్టే

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులు రాష్ట్రంలో (Andhra Pradesh) ఎక్కడా ఆనందంగా లేరని వారి కోసం పోరాడుతామని పేర్కొన్నారు. అనంతరం పలు సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, నేట్టం రఘురాం టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. Also Read: Venkaiah Naidu: భోగి వేడుకల్లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News