Ap Assembly live updates: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని దాడి కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ కొడాలి నాని చంద్రబాబుని ఏమన్నారు..
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ( Chandrababu naidu ) చాలాకాలంగా మంత్రి కొడాలి నాని టార్గెట్ చేశారు. తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ మరోసారి కొడాలి నాని ( Kodali nani ) చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి.
తెలుగుదేశం ( Telugu Desam ) పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నేత అని..తెలుగుదేశం ఫేక్ పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. పొత్తు లేకుండా పోటీ చేయలేని వ్యక్తికి..తమ నాయకుడిని విమర్శించే అర్హత లేదని కొడాలి నాని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన విమర్శల్ని నాని తిప్పికొట్టారు. పారిపోయే వాళ్లెవరనేది ప్రజలకు బాగా తెలుసని ఎద్దేవా చేశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పంకు పారిపోయింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
ఇక అంతటితో ఆగకుండా చంద్రబాబు పారిపోయిన క్రమాన్ని వివరించారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి కాల్వగట్టుకు చేరారన్నారు. తిరిగి కరోనా భయంతో అదే కాల్వగట్టు నుంచి హైదరాబాద్ పారిపోయారని చెప్పారు. ఈయనొక ఫేక్ ప్రతిపక్ష నేత అంటూ విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఒక్క పెన్షన్ కూడా పెంచలేదని..జగన్ ముఖ్యమంత్రి ( ys jagan ) అయ్యాక మాత్రం అర్హులందరికీ ఒకటో తేదీనే ఠంచనుగా పింఛను అందిస్తున్నామన్నారు.
ఇక వెన్నుపోటు రాజకీయాల్లో కూడా చంద్రబాబుని మించి మరెవరూ లేరని కొడాలి నాని తెలిపారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి..పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అయితే..సొంతంగా పార్టీ పెట్టి అధికారంలో వచ్చిన ధీరుడు వైఎస్ జగన్ అని చెప్పారు. Also read: AP: పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదు..వైఎస్ జగన్