Best Mileage Car 2023: స్విఫ్ట్ కంటే తక్కువ ధర.. ఈ కారు మైలేజీ, భద్రతలో సూపర్! 27 కిలోమీటర్ల మైలేజ్

Best Car For Mileage and Safety in India 2023. ఎక్కువ మైలేజీని ఇచ్చే టాటా టియాగో సీఎన్‌జీ మోడల్ ధర రూ. 6.44 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 28, 2023, 06:00 PM IST
  • స్విఫ్ట్ కంటే తక్కువ ధర
  • ఈ కారు మైలేజీ, భద్రతలో సూపర్
  • 27 కిలోమీటర్ల మైలేజ్
Best Mileage Car 2023: స్విఫ్ట్ కంటే తక్కువ ధర.. ఈ కారు మైలేజీ, భద్రతలో సూపర్! 27 కిలోమీటర్ల మైలేజ్

Best Mileage and Safety Cars in India 2023: రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రమాదాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దాంతో సురక్షితమైన మరియు శక్తివంతమైన కార్ల కోసం డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. అయితే మంచి భద్రతతో పాటు గొప్ప మైలేజీని అందించే కార్లకు భారత మార్కెట్లో ఇప్పటికీ కొరత ఉంది. ఈ రెండు ఫీచర్లతో ఉన్న కారు ఒకటి ఉంది. ఆ కారు ధర కూడా చాలా తక్కువ. ఆ కారు మీరేదో కాదు 'టాటా టియాగో' హ్యాచ్‌బ్యాక్. ఇది పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఎంపికలో అందుబాటులో ఉంది. ఈ కారు దేశంలోనే అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ కారు కాగా.. 4 స్టార్ రేటింగ్‌తో వస్తుంది.

టాటా టియాగో 6 మోడళ్లలో అందుబాటులో (XE, XM, XT(O), XT, XZ మరియు XZ+) ఉంది. ఈ కారు ధరలు రూ. 5.54 లక్షల నుంచి ప్రారంభమై రూ. 8.05 లక్షల వరకు ఉన్నాయి. ఎక్కువ మైలేజీని ఇచ్చే సీఎన్‌జీ మోడల్ ధర రూ. 6.44 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. సీఎన్‌జీ టాప్ మోడల్‌ను రూ. 8.05 లక్షలకు తీసుకోవచ్చు. టాటా టియాగోకి పోటీగా ఉన్న మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్ రూ. 7.80 లక్షల వరకు ఉంది. 

టియాగో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు మరియు వైపర్‌లతో వెనుక డీఫాగర్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు కూల్డ్ గ్లోవ్ బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, EBDతో కూడిన ABS మరియు నియంత్రణ ఫీచర్లు ఉన్నాయి.

టియాగో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 86PS పవర్ మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. సీఎన్‌జీ కిట్ పెట్రోల్ యూనిట్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్ ఎంపికలో 73PS పవర్ మరియు 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియాగో పెట్రోల్‌తో 20.01 కిలోమీటర్లు మరియు సీఎన్‌జీ తో 27 కిలోమీటర్లు వరకు మైలేజీని ఇస్తుంది. 

Also Read: Hyundai Sonata Facelift Launch: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. లుక్, ఫీచర్స్ అదుర్స్! లగ్జరీ కార్లకు ధీటుగా

Also Read: Upcoming Electric Cars: విడుదలకు సిద్ధంగా ఉన్న 5 ఎలక్ట్రిక్ కార్లు.. పూర్తి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News