Hyundai to launch Hyundai Sonata Facelift on March 30: ప్రముఖ కార్ల కంపెనీ 'హ్యుందాయ్' తన ప్రసిద్ధ సెడాన్ 'హ్యుందాయ్ సొనాటా' యొక్క కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. ఈ కారులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌డేట్ చేయబడ్డాయి. 2023 మార్చి 30న సియోల్ ఆటో షోలో హ్యుందాయ్ సొనాటా ప్రారంభించబడుతుంది. ఈ కారు కేవలం అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రమే విక్రయించబడుతోంది. ఈ కారు చూడడానికి భారతదేశంలో ఇటీవల లాంచ్ అయిన 'హ్యుందాయ్ వెర్నా' మాదిరే ఉంది. ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
హ్యుందాయ్ సొనాటా కారు పొడవైన LED DRL లైట్ బార్ మరియు స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు రూపాన్ని మరింత ఆకర్షణీయంగా చేసేందుకు ఫ్రంట్ గ్రిల్‌పై కోణీయ పొడిగింపులు ఇవ్వబడ్డాయి. ప్రొఫైల్ కూపే బాడీ స్టైల్‌ను కలిగి ఉంది. ఫెండర్‌ల నుండి టెయిల్-ల్యాంప్‌ల వరకు బలమైన షోల్డర్ లైన్‌ను ఈ కారు కలిగి ఉంటుంది.
కొత్త హ్యుందాయ్ సొనాటా క్యాబిన్‌లో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 12.3-అంగుళాల డ్రైవర్స్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పనోరమిక్ డిస్‌ప్లేతో కూడిన 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లోని టచ్-టైప్ క్లైమేట్ కంట్రోల్ యూనిట్ కారు యొక్క హైటెక్ అనుభూతిని పెంచుతుంది. ఈ కారు సెంటర్ కన్సోల్‌లో ఆర్మ్‌రెస్ట్, పెద్ద కప్ హోల్డర్‌లు మరియు అదనపు స్టోరేజ్ స్పేస్‌ని అందించే ట్రే ఉన్నాయి. ఇక స్టీరింగ్ వీల్ కూడా కొత్తది.
సొనాటా ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. పాత మోడల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌తో సహా బహుళ పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. పాత సొనాటా 290hp మరియు 422Nm ఉత్పత్తి చేసే 2.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో 8-స్పీడ్ DCT గేర్‌బాక్స్ జోడించబడింది. ఇక సొనాటా ఫేస్‌లిఫ్ట్ అదే పవర్‌ట్రెయిన్ ఎంపికలను కలిగి ఉంటుందని సమాచారం తెలుస్తోంది. ఈ కారులో లగ్జరీ కార్లకు ఉన్న ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ కారు ధర దాదాపుగా 20 లక్షలు ఉంటుందట.
Also Read: Nitish Rana KKR Captain: నితీశ్ రాణాను కేకేఆర్ కెప్టెన్‌గా నియమించడానికి 3 కారణాలు ఇవే!
Also Read: Kohli-Anushka: అనుష్క శర్మ.. నేను బాగా చేస్తానా?! నవ్వులు పూయిస్తున్న విరాట్ కోహ్లీ ప్రశ్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.