Budget 2023-24 Price Hike: కేంద్ర బడ్జెట్‌ 2023.. ధ‌ర‌లు త‌గ్గే, పెరిగే వస్తువులు ఇవే!

Here is Budget 2023 Cheaper and Costly Items List. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ 2023-24లో కీలక ప్రకటన చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 1, 2023, 01:28 PM IST
  • కేంద్ర బడ్జెట్‍ 2023-24
  • ధ‌ర‌లు త‌గ్గే వస్తువులు ఇవే
  • ధ‌ర‌లు పెరిగే వస్తువులు ఇవే
Budget 2023-24 Price Hike: కేంద్ర బడ్జెట్‌ 2023.. ధ‌ర‌లు త‌గ్గే, పెరిగే వస్తువులు ఇవే!

Budget 2023 Price Hike on Cigarettes, Gold and Cement: 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేటి ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం నిర్మలమ్మ ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలో ఉందని, ఉజ్వల భవిష్యత్తు వైపు దూసుకెళుతుందన్నారు. 2014 నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాయని సీతారామన్‌ పేర్కొన్నారు. 

సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ 2023-24లో కీలక ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, టీవీలు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ధ‌ర‌లు, కిచెన్ చిమ్నీల ధరలు తగ్గనున్నాయని చెప్పారు. అదే సమయంలో సిగ‌రెట్ల ధ‌ర‌లు, ర‌బ్బ‌ర్, బ‌ట్ట‌లు, సిమెంట్, వాహ‌నాల టైర్ల ధ‌ర‌లు పెరగనున్నాయి. టీవీ విడిభాగాలపై కస్టమ్స్ సుంకం ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించబడింది. 

బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీంతో బంగారం, వెండి, డైమండ్స్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బడ్జెట్‌ 2023-24 అనంతరం ఆ ధరలు మరింత పెరగనున్నాయి. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది. 

బడ్జెట్‌ 2023-24లో త‌గ్గే వస్తు ధరలు: 
మొబైల్ ఫోన్లు, కెమెరాలు, టీవీలు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ధ‌ర‌లు, కిచెన్ చిమ్నీలు. 
బడ్జెట్‌ 2023-24లో పెరిగే వస్తు ధరలు: 
సిగ‌రెట్ల ధ‌ర‌లు, ఇంపోర్టెడ్ ర‌బ్బ‌ర్, బ‌ట్ట‌లు, బంగారం, వెండి, డైమండ్స్, సిమెంట్, వాహ‌నాల టైర్లు.

Also Read: Union Budget 2023: బడ్జెట్ 2023.. ప్రత్యేక ఆకర్షణగా నిర్మలా సీతారామన్‌ చీరకట్టు! 2019 నుంచి ప్రత్యేక వస్త్రధారణ

Also Read: Budget 2023: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించింది వీరే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News