Union Budget 2023: బడ్జెట్ 2023.. ప్రత్యేక ఆకర్షణగా నిర్మలా సీతారామన్‌ చీరకట్టు! 2019 నుంచి ప్రత్యేక వస్త్రధారణ

FM Nirmala Sitharaman dons traditional temple border red saree on Union Budget 2023 Day. బడ్జెట్‍ 2023 సందర్భంగా నిర్మలమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ చీరకట్టులో పార్లమెంటుకు హాజరయ్యారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 1, 2023, 12:25 PM IST
  • కేంద్ర బడ్జెట్‍ 2023-24
  • ప్రత్యేక ఆకర్షణగా నిర్మలా సీతారామన్‌
  • 2019 నుంచి ప్రత్యేక వస్త్రధారణ
Union Budget 2023: బడ్జెట్ 2023.. ప్రత్యేక ఆకర్షణగా నిర్మలా సీతారామన్‌ చీరకట్టు! 2019 నుంచి ప్రత్యేక వస్త్రధారణ

FM Nirmala Sitharaman Wears Traditional Red Saree with Black and Gold Temple Border at Union Budget 2023: కేంద్ర బడ్జెట్‍ 2023-24ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ పార్లమెంట్‌లో కాసేపటి క్రితం ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ ద్వారా భారీగా ఊరట ఉంటుందని జనాలు ఆశిస్తున్నారు. బడ్జెట్‍ సందర్భంగా నిర్మలమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ చీరకట్టులో పార్లమెంటుకు హాజరయ్యారు. బడ్జెట్ ట్యాబ్‌తో ఎరుపు రంగు చీరలో సీతారామన్‍ దర్శనమిచ్చారు. బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ఎరుపు చీరతో కనిపించారు. 

నిర్మలా సీతారామన్‌ 2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచి బడ్జెట్‌ ప్రేవేశపెట్టే సందర్భాల్లో నిర్మలమ్మ సంప్రదాయ వస్త్రాలనే ధరించారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా సంప్రదాయమైన చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌ కలిగిన ఎరుపు రంగు చీరను ఆమె ధరించారు. ఎరుపు రంగు చీరలో బడ్జెట్‌ ట్యాబ్‌తో తన టీంతో కలిసి పార్లమెంట్‌కు హాజరయ్యారు.

టెంపుల్ చీరలను సాధారణంగా నూలు, పట్టు లేదా రెండిటి మిశ్రమంతో తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక సందర్భాలలో ధరిస్తారు. భారతీయ సంప్రదాయ వస్త్రాలంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 'సిల్క్‌, కాటన్ ఏదైనా.. ఒడిశా చేనేత చీరలు నాకు చాలా ఇష్టం. వాటి రంగు, నేతపని, ఆకృతి ఎంతో బాగుంటాయి' అని నిర్మలమ్మ పేర్కొన్నారు. ఇక నిర్మలా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టడం వ‌రుస‌గా ఇది ఐదోసారి.

నిర్మలా సీతారామన్‌ 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. 2021లో ఎరుపు-గోధుమ రంగు కలయిక భూదాన్‌ పోచంపల్లి చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని 'సిల్క్‌ సిటీ ఆఫ్ ఇండియా' అంటారు. ఇక 2022లో మెరూన్‌ రంగు చీరను నిర్మలమ్మ ధరించారు. ఇది ఒడిశాకు చెందిన చేనేత చీర. 2023లో ఎరుపు రంగు చీరలో సీతారామన్‍ దర్శనమిచ్చారు.

Also Read: Upcoming Cars 2023: ఫిబ్రవరిలో విడుదల కానున్న 4 కొత్త కార్లు.. చౌకైన ఎలక్ట్రిక్ కారు రిలీజ్!

Also Read: Maruti Suzuki Car Sales: అమ్మకాలలో రికార్డు నెలకొల్పిన మారుతి సుజుకి.. హ్యుందాయ్, టాటాలకు అందనంత ఎత్తులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News