EPFO New Rules: ఉద్యోగం మారితే పీఎఫ్ ఎక్కౌంట్ కూడా ఆటోమేటిక్‌గా మారిపోతుందా

EPFO New Rules: కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. నిత్య జీవితంతో ముడిపడి ఉండే చాలా అంశాల్లో కొత్త నిబంధనలు వచ్చి చేరాయి. అలాంటివాటిలో ఒకటి పీఎఫ్ ఎక్కౌంట్ నిబంధనల్లో మార్పు, ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 4, 2024, 07:19 PM IST
EPFO New Rules: ఉద్యోగం మారితే పీఎఫ్ ఎక్కౌంట్ కూడా ఆటోమేటిక్‌గా మారిపోతుందా

EPFO New Rules: ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ప్రైవేట్ ఉద్యోగి అయినా ప్రతి ఒక్కరూ పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరిగా కలిగి ఉంటుంటారు. ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబందన ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆ నిబంధన ఏంటనేది పరిశీలిద్దాం.

పీఎఫ్‌కు సంబంధించి అమల్లోకి వచ్చిన కొత్త రూల్ ప్రకారం పీఎఫ్ ఎక్కౌంట్ ఇకపై ఆటో ట్రాన్స్‌ఫర్ అవుతుంటుంది. అంటే ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఎక్కౌంట్‌ను కొత్త ఎక్కౌంట్‌కు మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగం మారినట్లయితే పీఎఫ్ ఎక్కౌంట్ దానికదే మారిపోతుంది. పీఎఫ్‌కు సంబంధించిన ఈ కొత్త రూల్‌తో చాలా మంది ఉద్యోగులకు ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు అధిక ప్రయోజనం కలగనుంది. 

ఇంతకుముందైతే ఎప్పుడు ఉద్యోగం మారినా కొత్త పీఎఫ్ ఎక్కౌంట్ మీ యూఏఎన్ నెంబర్‌కు అనుసంధానమయ్యేది. ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ ఈపీఎఫ్ నెంబర్ మెర్జ్ చేయాల్సివచ్చేది. ఇప్పుడు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ పీఎఫ్ ఎక్కౌంట్‌ను మెర్జింగ్ చేయాల్సిన పనిలేదు. ఉద్యోగం మారిన వెంటనే దానికదే బదిలీ అయిపోతుంది. పీఎఫ్ అనేది ఉద్యోగి కనీస వేతనం నుంచి 12 శాతం చెల్లిస్తే యజమాని మిగిలింది చెల్లిస్తాడు. ఆ తరువాత ఈ ఎక్కౌంట్ ఆధారంగా పెన్షన్ కూడా అందుతుంది. 

ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా ప్రకారం 2024 జనవరిలో 16.02 లక్షలమంది ఈపీఎఫ్ఓ ఎక్కౌంట్ తీసుకున్నారు. ఈపీఎఫ్ఓలో 8 లక్షల 8 వేలమంది కొత్తగా సభ్యత్వానికి రిజిస్టర్ చేసుకున్నారు. 

Also read: Glass Symbol: కూటమి కొంప ముంచనున్న గాజు గ్లాసు, ఈసీని ఆశ్రయించనున్న జనసేన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News