Work From Home Jobs: ఈ ఏడు కంపెనీల్లో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

Work From Home Jobs: కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రపంచమంతా వర్క్ ఫ్రం హోం ప్రారంభమైంది. కరోనా అనంతరం వర్క్ ఫ్రం హోం నుంచి బయటపడి ఆఫీసులకు వెళ్లడం మొదలైంది. అయితే ఇప్పటికే కొన్ని కంపెనీలు లేదా కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తూనే ఉన్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2024, 02:39 PM IST
Work From Home Jobs: ఈ ఏడు కంపెనీల్లో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

Work From Home Jobs: కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం నుంచి బయటపడేందుకు ఇష్టపడటం లేదు. ఆఫీసులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఇంకొందరు వర్క్ ఫ్రం హోం వద్దంటున్న పరిస్థితి కూడా ఉంది. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోంను పూర్తిగా తొలగిస్తే..మరికొన్ని సంస్థలు నెలకు కొన్నిరోజులు ఆఫీసుకు రావల్సిందేనని కండీషన్లు పెట్టాయి.

ఈ నేపధ్యంలో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం పాటిస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ఇవాళ మేం మీ కోసం అలాంటి 7 సంస్థల గురించి చెప్పదల్చుకున్నాం. ఈ సంస్థల్లో ఉద్యోగం సంపాదించుకుంటే ఇంట్లో కూర్చునే హాయిగా సంపాదించుకోవచ్చు. వీటిలో శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు. 

1. మిన్నెసోటా మైనింగ్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ స్థూలంగా 3Mగా పిల్చుకునే కంపెనీ ఉద్యోగులకు వర్క్ షెడ్యూల్ ఖరారు చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎక్కడ్నించైనా పని చేసుకోవచ్చు. 

2. Airbnb అనే సంస్థ శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పిస్తోంది. ఇది కాకుండా Aquent సంస్థ కూడా వర్క్ ఫ్రం హోం సౌకర్యం అందిస్తోంది. 

3. Atlassian అనే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ వర్క్ ఫ్రం హోంను శాశ్వతంగా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 

4. AWeber అనే మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తోంది. 

5. Blackbaud కంపెనీ సైతం శాశ్వతంగా ఇంటి నుంచి పని కల్పిస్తోంది. ఇది క్రిప్టోకరెన్సీ క్రయ విక్రయాలు జరిపే వేదిక.

6. Dropbox అనే మరో సంస్థ కూడా ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ కంపెనీ కస్టమర్లకు కావల్సిన బిజినెస్ కమ్యూనికేషన్, ఐటీ సపోర్ట్ అందిస్తుంటుంది.

7. HubSpot అనేది మార్కెటింగ్ అండ్ సేల్స్ సంస్థ. ఈ సంస్థ హైబ్రిడ్ వర్క్ మోడల్ అందిస్తోంది. ఉద్యోగులు వారంలో 2 లేదా అంతకంటే ఎక్కువరోజులు ఆఫీసు నుంచి పనిచేయాలి. మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి చేసుకోవచ్చు.

Also read: AP Bhavan Assets: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఆస్థుల పంపిణీలో కీలక పరిణామం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News