AP Bhavan Assets: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఆస్థుల పంపిణీలో కీలక పరిణామం

AP Bhavan Assets: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలోని తెలుగు రాష్ట్రాల ఆస్థుల విభజనకు మార్గం సుగమమైంది. ఇక అధికారికంగా ఆస్థుల పంపిణీ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 15, 2024, 11:35 AM IST
AP Bhavan Assets: ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఆస్థుల పంపిణీలో కీలక పరిణామం

AP Bhavan Assets: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి పదేళ్లు కావస్తున్నా ఆస్థుల విభజన అంశం ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ఆస్థుల వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల ఆస్థుల పంపిణీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దేశ రాజదాని ఢిల్లీలో ఏపీ భవన్ సహా భూములు, భవనాలు దాదాపు 10 వేల కోట్ల విలువైనవి ఉన్నాయి. ఇందులో గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్శింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ వంటివి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి వెలుపల ఉండే ఆస్థుల్ని రెండు తెలుగు రాష్ట్రాలు 
58:42 నిష్పత్తిలో పంచుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచారు. ఫలితంగా పదేళ్లుగా సాగుతున్న ఆస్థుల పంపకం వ్యవహారం కొలిక్కివచ్చినట్టేనని తెలుస్తోంది. ఆస్థుల పంపకాల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకారం తెలపడంతో మార్గం సుగమమమైంది. 

ఆస్థుల పంపకం ఇలా

మొత్తం 19.781 ఎకరాల్లో ఉన్న ఏపీ భవన్ ఆస్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 11,356 ఎకరాలు, తెలంగాణకు 8,245 ఎకరాలు కేటాయింపుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏపీ భవన్ పరిధిలో ఉన్న గోదావరి బ్లాక్‌లోని 4.315 ఎకరాలు, శబరి బ్లాక్‌లోని ఇన్నర్ రోడ్స్, ఆక్రమణకు గురైన ప్రాంతంలోని దుకాణాలున్న 0.512 ఎకరం, నర్శింగ్ హాస్టల్ ఉన్న 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్‌లోని 2.396 ఎకరాలు ఏపీకు కేటాయించేలా ప్రతిపాదన జరిగింది. ఇక శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లోని 5.245 ఎకరాలు తెలంగాణకు కేటాయించేలా ప్రతిపాదన. ఏపీకు కేటాయించిన ఆక్రమణలు ఉన్న ప్రాంతాన్ని స్వాధినం చేసుకోలేని పక్షంలో అందుకు సమానమైన భూమిని శబరి బ్లాక్ లేడా పటౌడీ హౌస్ భూమి నుంచి కేటాయించాలనేది ఏపీ విధించిన కండీషన్. 

ఈ ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాలు అంగీకరించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాల ప్రతిపాదన, స్పందనల్ని ఆయా రాష్ట్రాలకు తెలిపింది. దాంతో ఇక పంపిణీకు ఉన్న అడ్జంకులు దాదాపుగా తొలగిపోయాయి. 

Also read: AP Elections 2024: ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు, ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News