Check Bounce: అసలు చెక్‌ బౌన్స్‌ అంటే ఏమిటి? బండ్ల గణేశ్‌ మాదిరి కావొద్దంటే ఇవి తెలుసుకోండి

Check Bounce Information: చెక్‌ బౌన్స్‌ కేసు చాలా నేరమా? చెక్‌ బౌన్స్‌ జరిగితే బండ్ల గణేశ్‌ మాదిరి శిక్ష పడుతుందా? అసలు చెక్‌ బౌన్స్‌ ఏమిటి? అలా జరిగితే ఉన్న నిబంధనలు, శిక్ష, జరిమానా ఏమిటో సమగ్ర వివరాలు తెలుసుకోండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 15, 2024, 11:36 PM IST
Check Bounce: అసలు చెక్‌ బౌన్స్‌ అంటే ఏమిటి? బండ్ల గణేశ్‌ మాదిరి కావొద్దంటే ఇవి తెలుసుకోండి

Check Bounce Definition: సినీ నిర్మాత, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధించడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అసలు బండ్ల గణేశ్‌ చేసిన నేరమేమిటో చర్చనీయాంశమైంది. అంతటి పెద్ద శిక్ష వేయడానికి గల వెనుకాల ఉన్న కారణాలేమిటో సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే బండ్ల గణేశ్‌ పెద్దగా అక్రమాలకు పాల్పడలేదు. కేవలం ఒకే ఒక తప్పు చేశాడు. అంతే ఆ తప్పుకు ఇంతటి భారీ శిక్ష పడింది. 

Also Read: Organ Donor: సామాన్యులకు కూడా 'వీఐపీ' అంత్యక్రియలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

బండ్ల గణేశ్‌కు జైలు శిక్ష పడడానికి కారణం చెక్‌ బౌన్స్‌. చెక్‌ బౌన్స్‌ అంటే చాలా ప్రమాదకరం. ఒక్కోసారి చాలా తీవ్రమైన శిక్షలు కూడా పడతాయి. ఉద్దేశపూర్వకంగా చెక్‌ బౌన్స్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు చెక్‌ బైన్స్‌ అంటే ఏమిటి? బౌన్స్‌ కాకుండా ఏం చేయాలి? చెక్‌ బౌన్స్‌ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో మొత్తం ఇప్పుడు వివరంగా చూద్దాం.

- చెక్ బౌన్స్ అయితే నేరంగా పరిగణించబడుతుంది. చెక్ బౌన్స్‌కు పాల్పడితే చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు. చెక్‌ విలువను బట్టి శిక్షలు ఉంటాయి.
- శిక్ష మాత్రమే కాదు బండ్ల గణేశ్‌కు విధించినట్టు జరిమానా కూడా చెల్లించాలి. 
- ఒక చెక్ బౌన్స్ అయితే చెక్కు ఇచ్చిన వ్యక్తిని దోషిగా పరిగణిస్తారు. అంటే ఎవరైనా మీకు చెక్ ఇచ్చి అది బౌన్స్ అయితే చెక్‌ ఇచ్చిన వ్యక్తి దోషి అవుతాడు.

Also Read: Elections Survey: దేశ ప్రజలకు PINEWZలో అద్భుత ఛాన్స్‌.. ఎన్నికలపై మీ అభిప్రాయం తెలిపే సదావకాశం

చెక్‌బౌన్స్‌ అంటే ఇదే..
బ్యాంకులో నగదు నిల్వలు లేకుండా చెక్‌ను ఇస్తే అది చెక్‌బౌన్స్‌ కింద పరిగణిస్తారు. మీరు ఎవరికైనా చెక్‌ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకపోతే చెక్‌ బౌన్స్‌గా చెబుతారు. పరస్పరం వెంటనే పరిష్కరించుకుంటే ఈ చెక్‌ బౌన్స్‌ అంశం సద్దుమణుగుతుంది. ఉద్దేశపూర్వకంగా చెక్‌ బౌన్స్‌ చేస్తే మాత్రం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

చెక్ బౌన్స్ అయిన పక్షంలో చెక్ ఇచ్చిన వ్యక్తికి లీగల్ నోటీసు పంపవచ్చు. ఈ నోటీసులకు సదరు వ్యక్తి  15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. బదులు ఇవ్వకపోతే అతడిపై నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ చట్టం- 1881 ప్రకారం కింద కేసు నమోదు అవుతుంది. ఈ చట్టంలోని సెక్షన్ 148 కింద చెక్ బౌన్స్ కేసు కూడా మోసపోయిన వ్యక్తి చెక్ ఇచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేయవచ్చు. ఇది శిక్షార్హమైన నేరం. 

ఈ సెక్షన్‌ ప్రకారం చెక్‌ బౌన్స్‌కు పాల్పడ్డ వ్యక్తికి సాధారణంగా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతోపాటు చెక్ బౌన్స్ అయితే జరిమానా కూడా చెల్లించాల్సి కూడా ఉంటుంది. కేసులోని అంశాలు, పరస్పర అవగాహనను బట్టి కేసులో మార్పులుచేర్పులు ఉంటాయి. జరిమానాతో పాటు బౌన్స్ అయిన చెక్కుకు కూడా పెనాల్టీ విధిస్తారు. ఇది చెక్కుపై రాసిన మొత్తం రెండింతలు కూడా కావచ్చు. చెక్‌ బౌన్స్‌ కేసులో నిర్ధిష్టమైన శిక్ష, జరిమానా అనేది మారుతు ఉండవచ్చు. ఇక చెక్కు బౌన్స్‌కు పాల్పడిన వ్యక్తి అంటే చెక్‌ ఇచ్చిన వ్యక్తికి ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.  చెక్‌బౌన్స్‌ కేసులో 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడితే బెయిల్ పొందే అవకాశం ఉంది.

చెక్కు ఉత్త కాగితం కాదు. ఎంతో విలువైనది. ఆ కాగితానికి అనేక చట్టాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించి చెక్కును వాడాలి. ఎవరికైనా చెక్‌ రాసి ఇస్తుంటే అంత మోతాదు నగదు నిల్వలు మీ బ్యాంక్‌ ఖాతాలో ఉండాలి. ఒకవేళ అలా చూసుకోకుండా చెక్‌బౌన్స్‌ అయిన పక్షంలో కేసు వేయకుండా ముందే సంబంధిత వ్యక్తులతో మాట్లాడుకోవచ్చు. కొంత జరిమానాగా చెల్లించి సంబంధిత వ్యక్తులు కేసులు వేయకుండా ముందస్తు జాగ్రత్త పడవచ్చు. పొరపాటున చెక్‌బౌన్స్‌ అయిన పక్షంలో పరస్పరం సహకరించుకుంటే అంతటితో వివాదం ముగుస్తుంది. లేదంటే బండ్ల గణేశ్‌కు జరిగిన మాదిరి జరగవచ్చు. ప్రస్తుతం బండ్ల గణేశ్‌ తనపై పడిన శిక్షపై అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అప్పీల్‌కు అంగీకరించకుంటే బండ్ల గణేశ్‌ జైలుకు వెళ్లక తప్పదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News