State Honors Funeral: ప్రభుత్వ అధికార అంత్యక్రియలు పొందాలంటే సమాజానికి ఎంతో మేలు చేసి ఉండాలి. గొప్పవారికి తప్ప సామాన్యులకు అలాంటి గౌరవం దక్కదు. కానీ ఇకపై అలాంటి గౌరవం సామాన్యులకు కూడా దక్కనుంది. అయితే అవయవదానాలు చేసి ఉంటే సరిపోతుంది. అవును ఇప్పటికే తమిళనాడులో అవయవదానం చేసిన దాతలకు అంత్యక్రియలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. వీఐపీలకు ఇచ్చిన గౌరవ మర్యాదలతో ఆఖరి ఘడియలు చేయిస్తోంది. ఇక ఒడిశా ప్రభుత్వం కూడా అదే నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన చేశారు.
Also Read: KCR Birth Day: ఆటో డ్రైవర్లకు కేసీఆర్ జన్మదిన 'కానుక' రూ.10 కోట్లు .. 17న గులాబీ పండుగ
అవయవదానం చేసి మృతి చెందిన వారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తామని నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అవయవదానం ప్రాముఖ్యం వివరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అవయవదానం ప్రతిఒక్కరూ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అవయవదానంపై ఒడిశా ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 2019లో గంజాం జిల్లాకు చెందిన సూరజ్ అవయవదానం చేసి కొందరికి పునర్జన్మ ప్రసాదించాడు. అతడి పేరు మీద సీఎం నవీన్ పట్నాయక్ ఓ అవార్డు ప్రకటించారు. ప్రతియేటా సూరజ్ పేరు మీదుగా అవార్డు కింద రూ.5 లక్షలు అందిస్తున్నారు.
Also Read: Daughter In Law: కోడలి తిక్క కుదిరింది.. కొడుకు తన తల్లిని సంరక్షించుకుంటే గృహహింసనా? ఇదేం విడ్డూరం
ఒడిశాలో అవయవదానంపై ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేశారు. రాష్ట్ర అవయవాల మార్పిడి సంస్థ (సొట్టొ) అనే సంస్థ ఆధ్వర్యంలో అవయవాల మార్పిడి, అవయవాల దానంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంస్థ అవయవదానంపై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతోంది. అవయవదానం ప్రక్రియను సులభతరం చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. చనిపోయిన మట్టిలో కలిసే.. బూడిలో కాలే అవయవాలను దానం చేస్తే ఎంతో మంది ఉపయోగపడతాయని సొట్టొ అవగాహన కల్పిస్తోంది. కాగా సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. అవయవదానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకుని దానం చేస్తే ఎక్కడ అవయవాల కొరతతో మరణాలు ఉండవని పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగాలని నెటిజన్లు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook