BHU IIT Student: రాత్రి వేళ ఫ్రెండ్‌తో వాకింగ్‌కు వచ్చిన యువతి.. ముగ్గురు యువకులు దుస్తులు విప్పించి దారుణం..!

Uttar Pradesh Crime News: రాత్రి వేళ స్నేహితుడితో వాకింగ్‌కు వచ్చిన ఓ యువతి పట్ల ముగ్గురు యువకులు దారుణంగా ప్రవర్తించారు. స్నేహితుడిని కొట్టి.. తుపాకీతో బెదిరించి దుస్తులు విప్పించి అత్యాచారానికి యత్నించారు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో‌ చిత్రీకరించి.. అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా..   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2023, 11:32 PM IST
BHU IIT Student: రాత్రి వేళ ఫ్రెండ్‌తో వాకింగ్‌కు వచ్చిన యువతి.. ముగ్గురు యువకులు దుస్తులు విప్పించి దారుణం..!

Uttar Pradesh Crime News: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాశీ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బీహెచ్‌యూ క్యాంపస్‌లో బుధవారం రాత్రి స్నేహితుడితో కలిసి వాకింగ్‌కు వెళ్లిన ఐఐటీ విద్యార్థినిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి యత్నించారు. యువతిని తుపాకీతో బెదిరించి దుస్తులు తీసేసి వీడియో తీశారు. స్నేహితుడిపై దాడి చేసి.. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో బీహెచ్‌యూలో తీవ్ర ఉద్రక్తత నెలకొంది. వందలాది మంది విద్యార్థులు గురువారం రాజ్‌పుతానా హాస్టల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రోడ్లపైకి వచ్చారు. బీహెచ్‌యూ హాస్టళ్లలో వైఫైను మొత్తం నిలిపివేసింది. బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా..

బుధవారం రాత్రి ఐఐటీ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వాకింగ్‌కు వచ్చింది. ఇద్దరూ కర్మన్ బాబా గుడి దగ్గరికి చేరుకున్నారు. అదే సమయంలో బుల్లెట్‌ బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు వచ్చి వారిని అడ్డుకున్నారు. తుపాకీతో బెదిరించి.. విద్యార్థినితో ఉన్న ఆమె స్నేహితుడిని చితక్కొట్టారు. అనంతరం విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె నోటిని నొక్కేసి.. పక్కకు తీసుకెళ్ళారు. ఆమెను ముద్దు పెట్టుకుని బట్టలన్నీ తీసేస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తించి వీడియో కూడా తీశారు. యువతి గట్టిగా కేకలు వేయడంతో ఆమె మొబైల్ తీసుకుని ముగ్గురు అక్కడి నుంచి పరార్ అయ్యారు. 

ఓ ప్రొఫెసర్ సాయంతో యువతి సెక్యూరిటీ సిబ్బంది వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి అధికారులకు సమాచారం అందింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు లంక పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్లపై నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే బీహెచ్‌యూ అంతా ఆగ్రహం పెల్లుబికింది. వందలాది మంది విద్యార్థులు రాజ్‌పుతానా కూడలికి చేరుకుని ఆందోళన బాటపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని.. అన్ని వైపుల నుంచి ఐఐటీ క్యాంపస్‌ను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించాలన్నారు. యూనివర్సిటీలో భద్రతను పెంచాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బీహెచ్‌యూలోని సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో కూడా బీహెచ్‌యూలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో విద్యార్థినులపై వేధింపులు జరగ్గా.. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. తాజా ఘటన తరువాత వర్సిటీ యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యూనివర్సిటీ అన్ని గేట్లను క్లోజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాత్రిపూట క్యాంపస్‌లోకి రావాలంటే బీహెచ్‌యూ స్టిక్కర్లు లేదా బీహెచ్‌యూ గుర్తింపు కార్డు కచ్చితంగా చూపించాలని స్పష్టం చేసింది. 

Also Read: Zebronics Juke Bar 9750 Pro: డెడ్‌ చీప్‌ ధరకే JBL సౌండ్‌ బార్‌ను మించిన Zebronics Juke బార్‌..ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే!  

Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News