Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Lava Blaze 2 5G Price: అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే Blaze 2 5G స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2023, 03:23 PM IST
Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

 

Lava Blaze 2 5G Price: ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం చాలా మంది లక్షల్లో వెచ్చించాల్సిన కాలం పోయింది. అతి తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ ఫోన్స్‌ మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. లావా నుంచి కూడా ఇటీవలే ఓ స్మార్ట్‌ ఫోన్ విడుదలైంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ Blaze 2 5G పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ రింగ్ లైట్, 5జీ కనెక్టివిటీ వంటి చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో విడుదలైంది. అతి తక్కువ ధరలో రింగ్ లైట్‌తో వస్తున్న మొదటి 5G స్మార్ట్‌ఫోన్ ఇదే అవ్వడం విశేషం..   

లావా విడుదల చేయబోయే Blaze 2 5G  ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ శక్తివంతమైన మీడియాటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 390,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది. 

ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటి వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్‌తో ధర రూ.9,999లో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్‌  6GB RAM + 128GB స్టోరేజ్‌తో రూ.10,999లతో లభిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ నవంబర్ 9 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్‌ మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Blaze 2 5G స్పెసిఫికేషన్‌లు:
Lava Blaze 2 5G  స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD + IPS పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 2.5D నాడ్జ్‌ స్క్రీన్‌తో రాబోతోంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో రన్‌ అవుతుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ ఫోన్‌ 2 సంవత్సరాల పాటు సెక్యూరిటీతో అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌కు కంపెనీ ఉచితంగా  'ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్' కూడా అందిస్తోంది. 

Blaze 2 5G  ఇతర ఫీచర్స్‌:
6.56 అంగుళాల HD పంచ్-హోల్ డిస్‌ప్లే
రింగ్ లైట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా
స్క్రీన్ ఫ్లాష్‌తో కూడిన 8MPసెల్ఫీకెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News