Balakrishna Hinted on Rana Naidu: బాలయ్య ముందే చెప్పాడు బట్టలిప్పేశారని.. మనమే గుర్తుపట్టలేదు!

Balakrishna Hint on Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది, అయితే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ఈ విషయాన్ని ముందే బాలకృష్ణ చెప్పేశారు. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 11, 2023, 05:03 PM IST
Balakrishna Hinted on Rana Naidu: బాలయ్య ముందే చెప్పాడు బట్టలిప్పేశారని.. మనమే గుర్తుపట్టలేదు!

Balakrishna Hinted about Rana Naidu: విక్టరీ వెంకటేష్, రానా ప్రధాన పాత్రధారులుగా రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఒక అమెరికన్ సిరీస్ ని ఇండియన్ అడాప్షన్ గా చేసుకుని ఈ సిరీస్ తెరకెక్కించారు. పూర్తిస్థాయి నెట్ ఫ్లిక్స్ స్టాండర్డ్స్ ప్రకారం తెరకెక్కించిన ఈ సిరీస్ నిన్న అర్ధరాత్రి నుంచి ప్రసారం కావాల్సి ఉంది కానీ కొన్ని అనుకోని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వెంకటేష్ అంటే ఇప్పటివరకు ఫ్యామిలీ హీరోగానే అందరికీ తెలుసు. వెంకటేష్ తెలుగులో ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న హీరో గానే అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు అన్నింటినీ ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్ హిట్టు చేశారు. కానీ ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ చూస్తే మాత్రం ఏ ఒక్కరూ తమ ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి ఉంది, ప్రతి పావుగంటకు లేదా ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక డబుల్ మీనింగ్ జోకులు వెంకటేష్ చేతే వేయిస్తూ అనవసరమైన సెక్స్ సీన్లు కూడా సిరీస్ లో చొప్పించారు.

బహుశా నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ చూసేవారికి ఇది కామన్ అనిపించవచ్చు కానీ ఆ సిరీస్ లో రానా, వెంకటేష్ లాంటి తెలుగు స్టార్ హీరోలు నటించడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కొంతమంది అయితే దగ్గుబాటి రామానాయుడు వారసులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వీరు ఇలాంటి బూతు కంటెంట్ ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లోనే ప్రశ్నించారు.

గతంలో రానా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ కి హాజరైన సమయంలో నందమూరి బాలకృష్ణ రానాతో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు వివేకానందుడి లాంటి మీ బాబాయి  బట్టలిప్పించేసావు కదా రానా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం నందమూరి బాలకృష్ణ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు మనమే అర్థం చేసుకోలేదు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సిరీస్ మీరు చూశారా చూస్తే మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.

Also Read: Lauren Gottlieb To Dance on Naatu Naatu: చరణ్, ఎన్టీఆర్ లను కాదని ఈ భామతో డ్యాన్స్ చేయిస్తున్న ఆస్కార్ టీం!

Also Read: Shruthi Nanduri : నండూరి ఎంకి వారసురాలు వచ్చేసింది.. 'ఆహా'లో సందడి చేస్తున్న అమెరికన్ డాక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News