బిగ్‌బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయింది యాంకర్ రవినా..పెరుగుతున్న ట్రోలింగ్

బిగ్‌బాస్ సీజన్ 5లో అసలేం జరుగుతోంది. జరుగుతున్న ఓటింగ్ విధానం సక్రమంగానే ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడనే ప్రచారం నేపధ్యంలో ట్రోలింగ్ ఎక్కువవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 28, 2021, 01:33 PM IST
  • బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు ఈ వారం ఎలిమినేషన్‌పై విమర్శలు
  • బిగ్‌బాస్‌లో 12 వ వారం యాంకర్ రవి ఎలిమినేషన్ అంటూ జోరుగా ప్రచారం
  • యాంకర్ రవి ఎలిమినేషన్ జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు
 బిగ్‌బాస్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయింది యాంకర్ రవినా..పెరుగుతున్న ట్రోలింగ్

బిగ్‌బాస్ సీజన్ 5లో అసలేం జరుగుతోంది. జరుగుతున్న ఓటింగ్ విధానం సక్రమంగానే ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడనే ప్రచారం నేపధ్యంలో ట్రోలింగ్ ఎక్కువవుతోంది. 

బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు(BiggBoss Season 5 Telugu) దాదాపు చివరి దశకు చేరింది. ప్రస్తుతం 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఇవాళ జరగనుంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలింది. మానస్ తప్ప మిగిలిన కంటెస్టెంట్లు అంతా ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నారు. కాజల్, ప్రియాంక, సిరి, యాంకర్ రవిలలో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారనే ప్రచారం జోరందుకున్న నేపధ్యంలో సన్నీ ఎవిక్షన్ పాస్ ఆధారంగా కాజల్‌ను సేవ్ చేశాడని తెలుస్తోంది. 

ఇక మరి మిగిలిన ముగ్గురిలో అందరికంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నది యాంకర్ రవికే. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా యాంకర్ రవి 12వ వారంలో అంటే ఇవాళ ఎలిమినేట్(Anchor Ravi Eliminated) అయ్యాడనేది జోరుగా ప్రచారం జరుగుతోంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే..రవి ఎలిమినేట్ అవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బ్రింగ్ బ్యాక్ రవి అంటూ ట్విట్టర్ లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 

బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న యాంకర్ రవిని(Anchor Ravi) బయటకు పంపించడం అన్యాయమంటున్నారు. పింకిని(Pinky) కాపాడేందుకు రవిని ఎలిమినేట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. పింకీ ఆటతీరు కొద్దివారాలుగా బాగాలేకపోయినా..పింకీ ఎలా సేవ్ అయిందని విమర్శిస్తున్నారు. ర‌విపై అభిమానాన్ని..పింకీ రూపంలో వ్యతిరేకతగా ప్రదర్శిస్తున్నారు. ఎవిక్షన్ పాస్‌ను కాజల్(Kajol)కోసం సన్నీ వాడటం వల్లనే రవి ఎలిమినేట్ అయ్యాడనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. అయితే ఇదంతా బిగ్‌బాస్ హౌస్(BiggBoss) నుంచి వస్తున్న లీక్ వార్తలు మాత్రమే. ఏం జరిగిందనేది ఇవాళ రాత్రి మాత్రమే తెలుస్తుంది. లీక్ వార్త నిజమేనా లేదా రవి ఎలిమినేషన్ వెనుక మరేదైనా ట్విస్ట్ ఉందా అనేది వేచి చూడాలి. 

Also read: Radhe Shyam Love Anthem : ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి అప్‌డేట్.. లవ్ ఆంథెమ్ సాంగ్‌ వచ్చేస్తోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News