Ante Sundaraniki Release Date: ‘అంటే సుందరానికీ!’ సినిమా కోసం సమ్మర్ సీజన్ ను బ్లాక్ చేసిన హీరో నాని

Ante Sundaraniki Release Date: డైరెక్టర్ రాజమౌళి తన కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం రెండేసి రోజులను గతంలో ప్రకటించగా అదే ట్రెండ్ ను కొంతమంది నిర్మాతలు ఫాలో అవుతూ తమ చిత్రాలను రిలీజ్ డేట్స్ ను బ్లాక్ చేసి ఉంచారు. ఈ క్రమంలో హీరో నాని కూడా తానేం తక్కువ కాదంటూ తన కొత్త చిత్రం కోసం ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ను బ్లాక్ చేసి పెట్టాడు. ఇంతకీ ఆ సంగతి ఏంటో మీరే చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 07:25 PM IST
    • ‘అంటే సుందరానికీ’ సినిమా రిలీజ్ పై మేకర్స్ స్పష్టత
    • ఏకంగా ఏడు డేట్స్ ను ప్రకటించిన చిత్రబృందం
    • అందులో కుదిరిన రోజున సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటన
Ante Sundaraniki Release Date: ‘అంటే సుందరానికీ!’ సినిమా కోసం సమ్మర్ సీజన్ ను బ్లాక్ చేసిన హీరో నాని

Ante Sundaraniki Release Date: కరోనా సంక్షోభంలో సమయంలో తన రెండు సినిమాలను ఓటీటీలో విడుదల చేసిన కథానాయకుడు నాని.. ఇటీవలే తన కొత్త చిత్రమైన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు తాను నటిస్తున్న మరో సినిమా ‘అంటే.. సుందరానికీ!’ రిలీజ్ కోసం ఏకంగా ఏడు ముహూర్తాలు ఫిక్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాలు రెండేసి రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్న క్రమంలో.. అందుకు తానేం తక్కువ కాదంటూ ఏడు రిలీజ్ డేట్స్ ను ప్రకటించేశాడు హీరో నాని. 

“మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా? ఫుల్ అవకాయ సీజన్ బ్లాక్.. మెల్లగా డిసైడ్ (రిలీజ్ డేట్) చేస్తాం” అంటూ హీరో నాని ఫన్నీగా ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఒక రోజు ఈ సినిమా విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశాడు. 

నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నజ్రియా ఫాహద్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌.వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా హాస్యప్రధానంగా సాగే కథతో రూపొందుతున్నట్లు ఇటీవలే విడుదలైన గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. 

‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లాంటి సంస్థ నిర్మిస్తుండడం కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.  

Also Read: Anasuya Bharadwaj Photoshoot: మత్తేక్కించే చూపులతో కట్టిపడేస్తున్న యాంకర్ అనసూయ

Also Read: Mouni Roy Saree Photos: పెళ్లి తర్వాత మౌనీ రాయ్ ఎలా మారిపోయిందో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News