భరత్ బహిరంగ సభలోకి మహేష్ బాబు ఎంట్రీ వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తోన్న క్షణం ఇది.

Last Updated : Apr 7, 2018, 09:09 PM IST
భరత్ బహిరంగ సభలోకి మహేష్ బాబు ఎంట్రీ వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తోన్న క్షణం ఇది. సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వేడుక జరుగుతున్న సమయం ఇది. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ ఒకరిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు ఓ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సరసన బాలీవుడ్ నటి కియారా అద్వాని జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, రావు రమేష్, రవి శంకర్, పోసాని కృష్ణమురళి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్‌లో రూపొందిన ఆడియో నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా విడుదలైంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ వేడుకకు మహేష్ బాబు అభిమానులతోపాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

 

ఇప్పటికే రిలీజైన ఈ సినిమాలోని మూడు పాటలకు ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. ఎల్బీ స్టేడియం వేదికగా భరత్ బహిరంగ సభ పేరిట జరుగుతున్న ఈ ఈవెంట్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరైన సందర్భంలో ఆయన అభిమానుల నుంచి కనిపించిన కోలాహలం అంతా ఇంతా కాదు. భరత్ అనే నేను చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆ దృశ్యాల్ని తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Trending News