Nayanthara-Vignesh Wedding: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేష్‌! మండపంలో నయనతారకు ముద్దు

Nayanthara Vignesh Shivan First Marriage Pic Out. ప్రేయసి నయనతారని పెళ్లాడిన డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 04:42 PM IST
  • ఇద్దరం ఒక్కటయ్యాం
  • పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేష్‌
  • మండపంలో నయనతారకు ముద్దు
Nayanthara-Vignesh Wedding: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేష్‌! మండపంలో నయనతారకు ముద్దు

Vignesh Shivan, Nayanthara first Wedding pic goes viral: కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. 5-6 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ ప్రేమ జంట నేడు (జూన్ 9) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రీసార్ట్‌లో నయన్-శివన్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో నయన్-శివన్‌ల పెళ్లి జరిగింది. వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

ప్రేయసిని పెళ్లాడిన డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. పెళ్లి మండపంలో నయనతార నుదుటన ముద్దు పెట్టిన ఫొటోను విఘ్నేశ్‌ తన ట్విటర్ ఖాతాలో షేర్‌ చేశాడు. 'ఆన్‌ ఏ స్కేల్‌ ఆఫ్‌ 10.. ఆమె తొమ్మిది నేను ఒకటి. నయన్‌, నేను ఒక్కటయ్యాం. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది. ఇప్పుడే నయనతారను పెళ్లాడా' అని విఘ్నేశ్‌ పేర్కొన్నాడు. 

విఘ్నేశ్‌ శివన్‌ షేర్ చేసిన పెళ్లి ఫొటో నెట్టింట వైరల్ అయింది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిండు నూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు. వీరి వివాహ వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ కింగ్ షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్‌, దర్శకుడు అట్లీ, సీనియర్ నటి రాధికా శరత్‌ కుమార్‌, హీరో విజయ్‌ సేతుపతి, హీరో కార్తి సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Also Read: Rishabh Pant Record: ధోనీ, కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టిన పంత్.. ఇప్పటికీ రైనానే తోపు!  

Also Read: Hindu Temple Vandalised: పాకిస్తాన్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి.. దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News