Hindu Temple Vandalised: పాకిస్తాన్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి.. దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం..

Another Hindu Temple Vandalised in Pakistan: పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులను భయభ్రాంతులకు గురిచేసేలా అక్కడి దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 9, 2022, 03:07 PM IST
  • పాకిస్తాన్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి
  • దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులు
  • బైక్స్‌పై వచ్చి దాడికి పాల్పడినట్లు వెల్లడి
  • ఆలయాలపై దాడులతో భయభ్రాంతులకు గురవుతున్న హిందువులు
Hindu Temple Vandalised: పాకిస్తాన్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి.. దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం..

Another Hindu Temple Vandalised in Pakistan: పాకిస్తాన్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కరాచీలోని కొరంగి ప్రాంతంలో ఉన్న శ్రీ మారీ మాత మందిర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో స్థానిక హిందువులు భయభ్రాంతులకు గురయ్యారు.ప్రస్తుతం అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

ఈ దాడిపై హిందూ కమ్యూనిటీకి చెందిన సంజీవ్ అనే స్థానిక వ్యక్తి మాట్లాడుతూ..  బైక్స్‌పై వచ్చిన ఓ గ్యాంగ్ ఆలయంపై దాడి చేసినట్లు తెలిపారు. ఆ గ్యాంగ్‌లో మొత్తం 6 నుంచి 8 మంది వరకు ఉన్నట్లు చెప్పారు. వాళ్లెవరో.. ఎందుకు ఆలయంపై దాడి చేశారో తమకు తెలియదన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు వచ్చారని.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని వెల్లడించారు. ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసినట్లు కొరంగి ఎస్‌హెచ్ఓ ఫరూఖ్ సంజ్రనీ ధ్రువీకరించారు.

పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందువుల ఆలయాలపై తరచూ దాడులు జరుగుతుండటం స్థానిక హిందూ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఇండస్ నది ఒడ్డున ఉన్న కొత్రి పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు స్థానికంగా ఉన్న చారిత్రక హిందూ దేవాలయంపై దాడి చేశారు.అంతకుముందు, ఆగస్టు నెలలో భోంగ్ పట్టణంలో ఓ మూక స్థానిక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసింది.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో 90 లక్షల మంది వరకు హిందువులు నివసిస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం సింధ్ ప్రావిన్స్‌లోనే ఉన్నారు. అతివాద భావాలు కలిగిన వ్యక్తుల కారణంగా ఇక్కడి హిందువులు తరుచూ ఇబ్బందులకు గురవుతున్నారు.

Also Read: Godse Movie Trailer: అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి.. పద్దతి ఉన్నోడే పార్లమెంట్‌టో ఉండాలి! మర్యాద ఉన్నోడే..  

Also Read: Numerology Radix 7: న్యూమరాలజీలో 'ర్యాడిక్స్ 7' ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా.. ఈ ర్యాడిక్స్ కలిగినవారు చాలా లక్కీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News