Rana Daggubati movies: రానా దగ్గుబాటి చేతికే సురేష్ ప్రొడక్షన్స్ ?

ఇటీవలే పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) అప్పుడే బాధ్యతలు సైతం ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం రానా దగ్గుబాటికి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌కి ( Suresh Productions ) సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

Last Updated : Sep 10, 2020, 09:22 PM IST
Rana Daggubati movies: రానా దగ్గుబాటి చేతికే సురేష్ ప్రొడక్షన్స్ ?

ఇటీవలే పెళ్లి చేసుకుని తన వైఫ్ మిహికా బజాజ్‌తో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) అప్పుడే బాధ్యతలు సైతం ఎక్కువవుతున్నట్టు తెలుస్తోంది. ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం రానా దగ్గుబాటికి సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్‌కి ( Suresh Productions ) సంబంధించిన పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. Also read : Chiranjeevi’s sister: చిరంజీవికి సోదరిగా వరుణ్ తేజ్ హీరోయిన్ ?

అప్పుడెప్పుడో 2004లో వచ్చిన బొమ్మలాట చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేసిన రానా.. ఆ తర్వాత నిర్మాతగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీ అయ్యాడు. మళ్లీ రెండేళ్ల క్రితం వచ్చిన c/o కంచరపాలెం ( c/o Kancharapalem )  చిత్రాన్ని ప్రజెంట్ చేయడం ద్వారా మరోసారి సినీ నిర్మాణంపై దృష్టిసారించిన రానా తాజాగా క్రిష్ణ అండ్ హిజ్ లీల ( Krishna and his leela ) అనే చిత్రాన్ని సైతం ప్రజెంట్ చేస్తున్నాడు. ఎంతో చరిత్ర కలిగిన సురేష్ ప్రొడక్షన్స్‌కి అధినేత అయిన సురేష్ బాబుకి తనయుడిగా ఎప్పటికప్పుడు నిర్మాతల కోణంలోంచి సినిమాల ట్రెండుని ఓ కంట కనిపెడుతున్న రానాకు ఈసారి ఏకంగా సురేష్ ప్రొడక్షన్స్‌నే హ్యాండిల్ చేసే అవకాశం రానున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.Also read : Sanjay Raut: కంగనా రనౌత్ తేల్చుకోవాల్సింది శివసేనతో కాదు: సంజయ్ రౌత్

రానా దగ్గుబాటికి ఇప్పటి నుంచే సురేష్ ప్రొడక్షన్స్ పగ్గాలు అప్పగిస్తే.. భవిష్యత్తులో అన్నివిధాల ఈజీ అవుతుందనేది సురేష్ బాబు ( Suresh Babu ) ఆలోచనగా తెలుస్తోంది. ఐతే సక్సెస్‌ఫుల్ హీరోగా ఎంతో బిజీగా ఉన్న రానా దగ్గుబాటికి నిర్మాతగా కెరీర్ కోసం కేటాయించేంత సమయం ఉంటుందా అనే సందేహాలు వ్యక్తంచేస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఐతే నిర్మాతగా రాణించే క్రమంలో తండ్రి సురేష్ బాబు సపోర్టు కూడా ఎలాగూ ఉంటుంది కదా అనే వాళ్లు కూడా లేకపోలేదు. ఏదేమైనా దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనలు ఏవీ లేవనే విషయాన్ని మాత్రం గుర్తించాల్సి ఉంటుంది. Also read : Actress Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్

ఇక రానా ఫిలిం కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రానా చేతిలో అరణ్య, 1945, హిరణ్య కశ్యప, విరాట పర్వం చిత్రాలు ఉన్నాయి. ఇందులో అరణ్య చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. తమిళంలో కాదన్, హిందీలో హాతీ మేరే సాతి టైటిల్స్‌తో ఈ చిత్రం విడుదల కానుంది. Also read : Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు

Trending News