Sanjay Raut: కంగనా రనౌత్ తేల్చుకోవాల్సింది శివసేనతో కాదు: సంజయ్ రౌత్

కంగనా రనౌత్ ముంబైకి వచ్చిన రోజే ముంబై పురపాలక శాఖ అధికారులు (BMC) ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న నటి కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ జేసీబీలతో కూల్చేశారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Last Updated : Sep 10, 2020, 02:21 PM IST
Sanjay Raut: కంగనా రనౌత్ తేల్చుకోవాల్సింది శివసేనతో కాదు: సంజయ్ రౌత్

తన సొంత ప్రాంతం నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) బుధవారం ముంబైకి తిరిగొచ్చారు. లాక్‌డౌన్, కరోనా నేపథ్యంలో ఆమె కొంతకాలం ముంబైకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. క్వీన్ కంగనా.. ముంబైకి వచ్చిన రోజే ముంబై పురపాలక శాఖ అధికారులు (BMC) ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న ఆమె కార్యాలయాన్ని జేసీబీలతో కూల్చేశారు (Kangana Ranauts office demolition). శివసేన పార్టీపై నటి కంగనా రనౌత్ తన ఆగ్రహాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లగక్కుతోంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) స్పందించారు. Kangana Ranaut: శివసేన కాదది..సోనియా సేన : ట్వీట్ వైరల్

ముంబైలోని కంగనా ఆఫీసు కూల్చివేతకు తమ శివసేన పార్టీకి ఏ సంబంధం లేదని వ్యాఖ్యానించారు. కంగనా ఆఫీసు కూల్చివేత పనులు చేపట్టింది బీఎంసీ అధికారులని పేర్కొన్నారు. ఈ విషయంపై కంగనాకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే బీఎంసీ మేయర్‌నుగానీ, బీఎంసీ కమిషనర్‌ను సంప్రదించడం ఉత్తమమని సూచించారు. అంతేకానీ  సంబంధం లేని విషయాలలో శివసేన జోక్యం అని వ్యాఖ్యానించవద్దని నటి కంగనాకు సంజయ్ రౌత్ సూచించారు. Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్

కాగా, అక్రమ కట్టడమంటూ ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న కంగనా కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేసింది. దీంతో ముంబైని పీఓకే పోల్చుతూ నటి కంగనా తన ఆగ్రహాన్ని చూపించింది. తన ఆఫీసు కూల్చివేతకు శివసేన కారణమని ఆరోపిస్తోంది. అది శివసేన కాదు సోనియా సేన అంటూ తీవ్ర వ్యాఖ్యలతో కంగనా రనౌత్ వరుస ట్వీట్లు, కామెట్లు చేస్తుంది. ముంబైలో తనకు ప్రాణహాని ఉందని అభ్యర్థించగా ఆమెకు వై కేటగిరీ భద్రతను సైతం కల్పించారు.  Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News