Actress Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్

నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తమ బిడ్డ శ్రావణి మరణానికి టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్‌రెడ్డి కారణమంటూ కుటుంబసభ్యులు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. actress Sravani Devaraj Reddy Audio leaked

Last Updated : Sep 10, 2020, 09:57 AM IST
  • తెలుగు బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు
  • తనతో గంటసేపు గడపాలని శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధించిన ఆడియో లీక్
  • ఈ కోణంలోనూ కేసు విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు
Actress Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్

తెలుగు బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు (TV actress Sravani suicide case) ఊహించని మలుపులు తిరుగుతోంది. తమ బిడ్డ శ్రావణి మరణానికి టిక్‌టాక్ ద్వారా పరిచయమైన కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డి కారణమంటూ కుటుంబసభ్యులు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే సాయికృష్ణారెడ్డి అనే యువకుడి కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి ఆరోపించాడు. సాయితో పాటు ఆమె కుటుంబసభ్యులు శ్రావణిని మానసికంగా వేధించారని దేవరాజ్ ఆరోపణలు చేసిన కొన్ని గంటలకే ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. శ్రావణిని దేవరాజ్ బెదిరిస్తున్నట్లుగా ఆడియోలో ఉంది. TV serial actress Shravani: వేధింపులు తాళలేక బుల్లితెర నటి బలవన్మరణం

తాను చెప్పినట్లుగా మర్యాదగా వచ్చి తనతో గంటసేపు గడపాలని.. తర్వాత ఏం జరుగుతుందని తనను అడగవద్దంటూ దేవరాజ్ శ్రావణిని బ్లాక్ మెయిల్ చేశాడు. ‘ఇంతటితో అన్నీ ఆపేయ్.. నీతో మాట్లాడను దేవా’ అని దేవరాజ్‌ను శ్రావణి బతిమిలానట్లు ఆ ఆడియో సంభాషణ (Devaraj Reddy blackmails TV actress Sravani)లో ఉంది. Sravani suicide case: టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది ? దేవరాజ్ ఏం చెబుతున్నాడు ?

శ్రావణి ఆత్మహత్యకు కారణమని దేవరాజ్ ఆరోపణలు ఎదుర్కొన్న సాయి కృష్ణారెడ్డి అనే యువకుడు స్పందించాడు. దేవరాజ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నాడు. తాను శ్రావణి కుటుంబానికి సన్నిహితుడినని, ఎప్పటి నుంచో ఆ కుటుంబంతో అనుబంధం ఉందన్నాడు. శ్రావణి జీవితాన్ని కాపడేందుకు యత్నించానని, కానీ అలా జరగలేదన్నాడు. తాను ఇప్పటికీ శ్రావణి కుటుంబంతో పాటే ఉన్నానని, ఎక్కడికీ పారిపాలేదని సాయి కృష్ణారెడ్డి తెలిపాడు. 

Mahesh Babu New Look: మహేష్ బాబు న్యూ లుక్ చూశారా..?

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News