Chiranjeevi’s sister: చిరంజీవికి సోదరిగా వరుణ్ తేజ్ హీరోయిన్ ?

మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ప్రస్తుత టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవి ( Sai Pallavi as Chiranjeevi's sister ) నటించనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెదలం మూవీని తెలుగులో మెగాస్టార్ హీరోగా రీమేక్ అవనున్న సంగతి తెలిసిందే.

Last Updated : Sep 10, 2020, 08:29 PM IST
Chiranjeevi’s sister: చిరంజీవికి సోదరిగా వరుణ్ తేజ్ హీరోయిన్ ?

మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ప్రస్తుత టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవి ( Sai Pallavi as Chiranjeevi's sister ) నటించనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెదలం మూవీని తెలుగులో మెగాస్టార్ హీరోగా రీమేక్ అవనున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ ( Meher Ramesh ) డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో ఒక హీరోయిన్ కోసం వేటలో ఉన్న మెహర్ రమేశ్.. ఆ పాత్ర కోసం ఫిదా మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్‌కి జంటగా నటించిన కేరళ బ్యూటీ సాయి పల్లవిని అప్రోచ్ అయినట్టు టాక్. Also read :  VV Vinayak meets Chiranjeevi చిరంజీవితో వివి వినాయక్‌ సినిమా ?

వెదలం తెలుగు రీమేక్ మూవీ ( Vedhalam Telugu remake ) ప్రీ ప్రొడక్షన్ పనులతో మెహర్ రమేశ్ బిజీగా ఉన్నాడు. సీరియస్ ఫ్యామిలీ డ్రామా బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి లాంటి పేరున్న నటీనటులు ఇంకెంతో మంది నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక మెహర్ రమేశ్ చిత్రాల విషయానికొస్తే.. గతంలో కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి చిత్రాలు చేసిన మెహర్ రమేశ్.. షాడో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. భారీ గ్యాప్ తెచ్చిన కసితో ఉన్న మెహర్ రమేశ్.. చిరు సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాడు. Also read : Vadivel Balaji Dies: కమెడియన్ వడివేల్ బాలాజీ మృతి

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీతో ( Acharya movie ) బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు మూవీ యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ ఫ్యాన్స్ సైతం ఆచార్య మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Also read : Sanjay Raut: కంగనా రనౌత్ తేల్చుకోవాల్సింది శివసేనతో కాదు: సంజయ్ రౌత్

Trending News