Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?

మన ఫేవరిట్ హీరోలను వారి స్టార్ నేమ్ తో మాత్రమే మనం గుర్తుపడతాం. కానీ ఇండస్ట్రీలో వారి అసలు పేరు తెలిసిన వారు మాత్రం చాలా తక్కువే.

Last Updated : Sep 9, 2020, 01:42 PM IST
    • మన ఫేవరిట్ హీరోలను వారి స్టార్ నేమ్ తో మాత్రమే మనం గుర్తుపడతాం.
    • కానీ ఇండస్ట్రీలో వారి అసలు పేరు తెలిసిన వారు మాత్రం చాలా తక్కువే.
    • చాలా మంది నటులు పరిశ్రమలోకి ఎంటర్ అవ్వగానే తమ పేరును మార్చుకుంటారు.
    • తారబలం, సంఖ్యా శాస్త్రం ఇతర కారణాల వల్ల ఇలా పేరు మార్చుకునే అవకాశం ఉంది.
    • దక్షిణాది తారల అసలు పేర్లు ఇవే..
Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?

మన ఫేవరిట్ హీరోలను వారి స్టార్ నేమ్ తో మాత్రమే మనం గుర్తుపడతాం. కానీ ఇండస్ట్రీలో వారి అసలు పేరు తెలిసిన వారు మాత్రం చాలా తక్కువే. చాలా మంది నటులు పరిశ్రమలోకి ఎంటర్ అవ్వగానే తమ పేరును మార్చుకుంటారు. తారాబలం, సంఖ్యా శాస్త్రం ఇతర కారణాల వల్ల ఇలా పేరు మార్చుకునే అవకాశం ఉంది. దక్షిణాది తారల అసలు పేర్లు ఇవే..

రజినీకాంత్ ( Rajinikanth Real Name )
భారత దేశం మొత్తంలో రజినీ కాంత్ అంటే తెలియని వారుండరు. బెంగుళూరులో బస్ కండక్టర్ గా కెరియర్ ప్రారంభించిన రజినీ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. ఛత్రపతి శివాజీ పేరుపై ఆయనకు ఆ పేరు పెట్టారు. నటుడిగా మారిన తరువాత రజినీకాంత్ గా మార్చకున్నారు.

చిరంజీవి  ( Chiranjeevi Real Name )
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అసలు ఊరు పశ్చిమ గోదావారి జిల్లాలో ఉన్న నర్సాపూర్ లోని మొగల్తూరు. ఆయన అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్.  1978 లో పునాది రాళ్ళు చిత్రంతో నటుడిగా కెరియర్ ప్రారంభించారు.

ధనుష్ ( Dhanush Real Name )
అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ధనుష్. అతని అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. 15 సంవత్సరాల నటనాజీవితంలో మూడు సార్లు నేషనల్ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు సాధించాడు. కొలవరి ఢీ సాంగ్ తో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించాడు.

ప్రభాస్ ( Prabhas Real Name )
ఈశ్వర్ సినిమాతో కెరియర్ ప్రారంభించిన ప్రభాస్ బాహుబలి మూవీతో నేషనల్ హీరో అయ్యాడు. ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంటక సత్యనారాయణ ప్రభాస్ రాజు.

కమల్ హాసన్ ( Kamal Hasan Real Name )
కలత్తూరు కన్నమ్మ అనే తమిళ చిత్రంతో బాల నటుడిగా రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్ భారత దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగాడు. కమల్ అసలు పేరు పార్థసారథి శ్రీనిమవాసన్.

మమ్ముట్టి ( Mammootty Real Name )
నాలుగు దశాబ్దాల సినీ ప్రస్తానంలో మమ్ముట్టి 400 చిత్రాలు చేశాడు. మమ్ముట్టి అసలు పేరు మొహమ్మద్ కుట్టి పనాపాంబిల్ ఇస్మాయిల్.  కెరియర్ ప్రారంభంలో సాజిన్ అనే పేరుతో కొన్ని సినిమాలు చేశాడు. తరువాత మమ్ముట్టిగా ఫిక్స్ అయ్యాడు.

పవన్ కల్యాణ్ ( Pawan Kalyan Real Name )
1996లో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రంతో తెరంగేట్రం చేసిన పవన్ కల్యాణ్, బద్రి, తమ్ముడు వంటి చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పవన్ కల్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు.

సూర్య ( Suriya Real Name )
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని తమిళ స్టార్ సూర్య.  ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన సూర్య అసలు పేరు శరవనన్ శివ కుమార్.

విజయ్ ( Vijay Real Name )
1984లో వేట్రి చిత్రంతో బాల నటుడిగా తెరంగేట్రం చేశాడు విజయ్. ఈ స్టార్ హీరో అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్.

యష్ ( Yash Real Name )
కేజీఎఫ్ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించిన నటుడు యష్. కర్ణాటకలోని హసన్ సమీపంలో ఉన్న భువనహల్లి గ్రామంలో జన్మించిన యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.

మహేష్ బాబు ( Mahesh Babu Real Name )
నాలుగేళ్ల వయసులోనే నీడ అనే చిత్రంలో నటించాడు మహేష్ బాబు. తరువాత బాలనటుడిగా అనే చిత్రాలు చేశాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చాక తిరుగులేని స్టార్ అయ్యాడు. మహేష్ అసలు పేరు మహేష్ ఘట్టమనేని.

Trending News