IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే

వీళ్లందరిలో అత్యధిక స్కోరు రోహిత్ శర్మ, కోహ్లీ, ధోనీ కాదు.. కెప్టెన్ గా వార్నర్ చేశాడు  

Last Updated : Sep 8, 2020, 05:27 PM IST
    • ఇండియన్ ప్రీమియరస్ లీగ్ ( IPL) లో దిగ్గజ క్రికెటర్లు తమ టీమ్ ను గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు.
    • వాళ్లు కెప్టెన్ అయితే వీళ్ల బాధ్యత మరింతగా పెరుగుతుంది. ఈ బాధ్యత వారి ఆటపై కూడా ప్రభావం చూపుతుంది.
    • ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే

ఇండియన్ ప్రీమియరస్ లీగ్ ( IPL) లో దిగ్గజ క్రికెటర్లు తమ టీమ్ ను గెలిపించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. వాళ్లు కెప్టెన్ అయితే వీళ్ల బాధ్యత మరింతగా పెరుగుతుంది. ఈ బాధ్యత వారి ఆటపై కూడా ప్రభావం చూపుతుంది. ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రపంచ కప్ లో ఏ విధంగా రెచ్చిపోయాడో...ఐపిఎల్ లో అంతగా రాణించలేక పోయాడు. ఐపిఎల్ లో ముంబై కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఫైనల్స్ లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు. అందుకే కేవలం ఐపిఎల్ ఫైనల్ లో 5 మంది కెప్టెన్ లు మాత్రమే 50  పరుగులు చేయగలిగారు.

12 ఫైనల్స్.. 12 కెప్టెన్లు

ఐపిఎల్ లో ఇప్పటి వరకు జరిగిన 12 సీజన్లలో 12 ఫైనల్స్ జరిగాయి. ఇందులో పన్నెండు మంది క్రికెటర్లు మాత్రమే వివిధ టీమ్ లకు కెప్టెన్లు గా వ్యవహరించడం విశేషం. ఈ 12 మంది కెప్టెన్స్ లో చైన్నై సూపర్ కింగ్స్ కు (Chennai Super Kings ) కు చెందిన మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni), ముంబై ఇండియన్స్ కు చెందిన సచిన్ టెండూల్క్ (Sachin Tendulkar),రోహిత్ శర్మ,  రాజస్తాన్ రాయల్స్ చెందిన (Rajasthan Royals) షేన్ వార్న్ (Shane Warne), రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు చెందిన (Royal Challangers Banglore) విరాట్ కోహ్లీ (Virat Kohli)  అనిల్ కుంబ్లే (Anil Kumble), సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన (Sunrisers Hyderabad)  డేవిడ్ వార్నర్ (David Warner) కేన్ విలియమ్సన్ (Kane Williamson), కింగ్ ఎలెవన్ పంజాబ్ కు చెందిన (KIngs XI Punjab) జార్జ్ బెయిలీ (George Balleiy), రైజింగ్ పూణె జయంట్ రైజర్స్ నుంచి స్టీవ్ స్మిత్ (Steve Smith), డెక్కన్ ఛార్జర్స్ నుంచి ఆడం గిల్ క్రిస్ట్ (Adam Gilchrist)  కోలకతా నైట్ రైజర్స్ నుంచి (Kolkata Knight Riders) గౌతం గంభీర్  (Gautam Gambhir ) పేర్లు ఉన్నాయి.

ఐదు మంది మాత్రమే అర్థ శతకం కొట్టారు...
ఈ మొత్తం 12 మంది క్రికెటర్లలో కేవలం 5 మంది మాత్రమే ఫైనల్స్ లో హాఫ్ సెంచరీలు కొట్టారు. అయితే ఇందులో ఎవరూ కూడా రెండో సారి అర్థ సెంచరీ కొట్టలేదు.  2016లో డేవిడ్ వార్నర్ 69 పరుగులు చేయగా అదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 54 రన్స్ చేశాడు. ఇలా ఇద్దరు కెప్టెన్లు 50 పరుగులు చేసిన మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. 2017లో స్టీవ్ స్మిత్ 51 పరుగులు చేయగా రోహిత్ శర్మ 2015లో 50 పరుగులు చేశాడు. ఫైనల్ లో అర్థం శతకం చేసిన 5వ బ్యాట్స్ మెన్ ధోని. 2013లో 63 పరుగులు చేశాడు ధోని.

మరో ఏడుగురు కెప్టెన్ల గురించి...
మిగితా ఏడు మంది కెప్టెన్ల గురించి మాట్లాడితే 2010 ఫైనల్ లో సచిన్ టెండూల్కర్ 48 పరుగులు చేశాడు. 2018 ఫైనల్స్ లో కెయిన్ విలియమ్సన్ 47 పరుగులు చేశాడు. 2014లో బెయిలీ 1 పరుగు మాత్రమే చేశాడు. 2009 ఫైనల్ లో కుంబ్లే 8 రన్స్ మాత్రమే చేశాడు. ఇక గౌతం గంభీర్ విషయానికి వస్తే 2012లో రెండు పరుగులు, 2014లో 23 పరుగులు చేశాడు. 2008లో షేన్ వార్న్ 9 పరుగుల చేసి నాటౌల్ గా నిలిచాడు. ఈ పరుగులు టీమ్ ను ట్రోఫి గెలిపించడంలో దోహదం చేశాయి. కెప్టెన్ గా 2009లో 00 పరుగులు అంటే జీరో కు ఔట్ అయ్యాడు గిల్ క్రిస్ట్.

అత్యధిక ఫైనల్ మ్యాచులు ఆడిన కెప్టెన్ గా ధోనీ..
ఐపిఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా ధోని రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తం 7 సార్లు తన టీమ్ ను ఫైనల్ కి తీసుకెళ్లాడు. అతని తరువాత రోహిత్ శర్మ 4 సార్లు కెప్టెన్సీ చేశాడు.

Trending News