మహేష్ బాబు పాటకు బాలీవుడ్ హీరో డ్యాన్స్..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కైరా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు

Last Updated : Apr 16, 2018, 11:44 PM IST
మహేష్ బాబు పాటకు బాలీవుడ్ హీరో డ్యాన్స్..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన చిత్రం "భరత్ అనే నేను". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కైరా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమాలోని పాట ‘ఓ వసుమతి..’ చాలా పెద్ద హిట్ అయ్యింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట బాగా పాపులర్ అయ్యి, యూట్యూబ్‌లో బాగా ఆదరణను కూడా పొందింది.

అయితే చిత్రమేంటంటే.. ఈ పాటకి సరదాగా ఓ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ డ్యాన్స్ చేశారట. ఆ డ్యాన్స్ వీడియోని కైరా అడ్వాణీ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో వరుణ్‌తో కలిసి కైరా కూడా ఆడి పాడడం గమనార్హం. వరుణ్ ధావన్ గతంలో కూడా మహేష్ బాబు గురించి పలుమార్లు మాట్లాడారు. తనకు టాలీవుడ్‌లో నచ్చిన అతి కొద్దిమంది హీరోల్లో మహేష్ బాబు అంటే కూడా ఇష్టమని తెలిపారు. 

మహేష్ బాబు నటించిన  "భరత్ అనే నేను" అనే  చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఏప్రిల్‌ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో మహేష్ సీఎం పాత్రలో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. శ్రీమంతుడు’ తర్వాత మహేశ్‌-కొరటాల కాంబినేషనులో వస్తున్న చిత్రం కావడంతో సినీ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు.  శరత్‌ కుమార్‌, ప్రకాశ్‌రాజ్‌, ఆమని, సితార, రావు రమేశ్‌, పోసాని, దేవదాస్ కనకాల, జీవా, అజయ్ ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Trending News