అరవింద సమేత సినిమాకు హైలైట్‌గా నిలిచిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇదే

అరవింద సమేత సినిమాకు హైలైట్‌గా నిలిచిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇదే

Last Updated : Oct 23, 2018, 06:26 PM IST
అరవింద సమేత సినిమాకు హైలైట్‌గా నిలిచిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇదే

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డె జంటగా నటించిన అరవింద సమేత సినిమా అభిమానులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ హైలైట్ గా నిలవగా ఆయా సన్నివేశాలకు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ప్రాణం పోసింది. రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సీన్స్ అయినా, గుండెలు పిండేసే ఎమోషన్ సీన్స్ అయినా.. ఇలా సన్నివేశం ఏదైనా ఆ సందర్భానికి తగినట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు థమన్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ పార్టనర్ అయిన జీ మ్యూజిక్ సౌత్ అరవింద సమేత సినిమాలోని అన్ని బ్యాగ్రౌండ్ స్కోర్ ఆడియో ఫైల్స్‌ని ఒక జ్యూక్ బాక్స్‌గా విడుదల చేసింది. అరవింద సమేత సినిమాను మరో స్థాయికి చేర్చిన ఈ బ్యాగ్రౌండ్ స్కోర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Trending News