విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త

విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు, స్వదేశంలో ఉన్న వారు అమెరికా, సింగపూర్ లాంటి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. 

Last Updated : May 7, 2020, 12:43 PM IST
విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు, స్వదేశంలో ఉన్న వారు అమెరికా, సింగపూర్ లాంటి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది.  Vizag Gas Leak: విశాఖ ఘటన హృదయ విదారకరం: చిరంజీవి, మహేష్ బాబు

ఇప్పటికే ఆసక్తి గల ప్రయాణికులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. మరోవైపు భారత్‌లో చిక్కుకున్న విదేశీయుులు, విదేశాలకు అత్యవసరంగా వెళ్లవలసిని వారి కోసం ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా అధికారులు వివరించారు. భారత్ నుంచి అమెరికా, లండన్, సింగపూర్, ఇతరత్రా విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోసం మే 8వ తేదీ నుంచి 14 వరకు ఈ ప్రత్యేక విమాన సర్వీసులను ఎయిరిండియా కల్పిస్తోంది. బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు

అదే విధంగా అమెరికా నుంచి భారత్‌కు రావాలనుకున్న వారి కోసం నాన్ షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులను తొలి దశలో మే 9 నుంచి 15 తేదీల మధ్య నడపనున్నారు. అయితే ప్రయాణికులే ఈ టికెట్ ధరలు చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా స్పష్టం చేసింది. భారత విదేశాంగశాఖ అధికారులు దీనిపై అన్ని సిద్ధం చేశారు. అయితే ప్రయాణానికి అర్హులైన వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు ఎయిరిండియా అనుసరించనుందని తెలిసిందే.

విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు, స్వదేశంలో ఉన్న వారు అమెరికా, సింగపూర్ లాంటి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
 

Air India opens bookings for those passengers who meet eligibility criteria and wish to travel from India to foreign

Trending News